సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 13, 2020 , 03:56:51

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : మాజీ ఎమ్మెల్యే వీరేశం

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : మాజీ ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్‌, నమస్తేతెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య సాధ్యమని ఉద్దీపన చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. బుధవారం మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన అయిటిపాముల లక్ష్మమ్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు స్థానిక ఎంపీపీఎస్‌ (మండల ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాల) విద్యార్థులకు పుస్తకాలు, ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతోనే నియోజకవర్గంలోని సర్కారీ పాఠశాలల్లో ఉద్దీపన కార్యక్రమాన్ని ప్రారంభినట్లు తెలిపారు. జాతీయ విద్యావిధానంతోపాటు ప్రమాణాలకు అనుగుణంగా పుస్తకాలు రూపొందిచి విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఓ ఎయిడెడ్‌ పాఠశాలను ఉద్దీపన లో భాగస్వామ్యం చేసి కార్పొరేట్‌కు ధీటుగా విద్య అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి పాఠశాలలో ఉద్దీపన సేవలతోపాటు వలంటీర్‌ను అందిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పూజర్ల శంభయ్య, మండల విద్యాధికారి గోలి చంద్రశేఖర్‌రెడ్డి, దాత మహేశ్‌, పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, పుట్ట సరితసత్యనారాయణ, మంగినపల్లి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


logo