శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 12, 2020 , 03:41:03

గులాబీ పార్టీకే రైతుల మద్దతు

గులాబీ పార్టీకే రైతుల మద్దతు

నార్కట్‌పల్లి : అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైన నార్కట్‌పల్లి, ఎల్లారెడ్డి గూడెం సహకార సంఘం చైర్మన్లు కసిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, గంట నర్సిరెడ్డిలను జడ్పీ నివాసంలో ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలను దృష్టిలో పెట్టుకొని రైతులందరు గులాబీ పార్టీకే తమ మద్దతు తెలిపి ఏకగ్రీవం చేశారని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతుందని పేర్కొన్నారు. ప్రతీ కార్యకర్త సహకార ఎన్నికలలో ఏకగ్రీవమే లక్ష్యంగా పనిచేసినందున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, చెర్వుగట్టు దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నెమ్మాని సర్పంచ్‌ గంట్ల నర్సిరెడ్డి, నారాయణరెడ్డి, బత్తుల అనంతరెడ్డి, అలుగుబెల్లి సత్తిరెడ్డి, వెంకన్న, సాగర్ల సైదులు, కొండూరి శంకర్‌, నడింపల్లి జగన్‌ పాల్గొన్నారు.logo