శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 11, 2020 , 02:44:02

ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు

ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు  మరిన్ని సేవలు

నల్లగొండసిటీ: పోలీస్‌ స్టేషన్లలో కల్పిస్తున్న ఆధునిక వసతులతో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని ఎస్పీ రంగనాథ్‌ పోలీసు సిబ్బందికి సూచించారు. సోమవారం నల్లగొండ పట్టణంలో ఆధునీకరించిన వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏఎస్పీ నర్మదతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో మొదటి విడుతలో కొన్ని స్టేషన్ల ఆధునీకరణ జరిగిందని, ఇందులో భాగంగా రూ. 16.50 లక్షలతో వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆధునీకరించామన్నారు. సీఐ సురేష్‌, సిబ్బంది పని తీరును అభినందించారు. ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పని  చేస్తూ ప్రజల పక్షాన నిలిచి న్యాయం అందించాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌లకు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించి సమస్యలు విని పరిష్కరించేలా ప్రయత్నం చేయాలన్నారు. పోలీసు స్టేషన్లలో రికార్డు నిర్వహణ, సిబ్బంది పని విధానంలో ఆధునికత కల్పించాలన్నారు. ఉన్నతాదికారులు సూచించే విధంగా 5ఎస్‌ విధానం అమలు చేయాలని తెలిపారు. అనంతరం ఎస్పీ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్పీకి వేద పండితుల ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ సతీష్‌ చోడగిరి, ట్రెయినీ ఐపీఎస్‌ వైభవ్‌గైక్వాడ్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ సురేష్‌, సబ్‌ డివిజన్‌ సీఐలు పీఎన్‌డీ ప్రసాద్‌, బాలగోపాల్‌, మహబూబ్‌పాష, సురేష్‌కుమార్‌, రాజశేఖర్‌, సురేష్‌బాబు, ఎస్‌ఐలు నరేష్‌, కొండల్‌రెడ్డి, నర్సింహులః, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరెడ్డి, పోలీసులు పాల్గొన్నారు. logo