బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 10, 2020 , 02:29:59

పల్లెల్లో ప్రగతి పరుగులు

పల్లెల్లో ప్రగతి పరుగులు

నల్లగొండ, నమస్తే తెలంగాణ : పల్లెలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు అక్కడ సౌకర్యాలను సైతం మెరుగు పరచాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రణాళికలో భాగంగా ప్రగతి పరుగులు పెడుతోంది. పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు తొలిదశగా చేపట్టిన పారిశుధ్యంపై దృష్టిసారించి ట్రాక్టర్లను కొనుగోలు చేసి చెత్తను ఏరివేసే కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు ముందుకెళ్తున్నారు. వీధుల్లో ఉన్న చెత్తను ట్రాక్టర్లలో పోసి అక్కడ నుంచి డంపింగ్‌యార్డులకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఇంట్లో ఉన్న చెత్తను డస్టుబిన్‌లో పోయాలని సూచిస్తు డస్టుబిన్లను సైతం ఇంటికి రెండు చొప్పున అందజేశారు. ఆ డస్టుబిన్‌లో ఉన్న చెత్తను పారిశుధ్య కార్మికులు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌ యార్డుకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. వందశాతం నిధులతో 387 ట్రాక్టర్లు కొనుగోలు జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు ఉండగా ఆయా గ్రామ పంచాయతీలలో ఉన్న నిధులతో ప్రభుత్వ సూచన మేరకు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ట్రాక్టర్ల కొనుగోలు చేపట్టింది. 387 గ్రామాలకు చెందిన పాలకవర్గం పూర్తిస్థాయిలో నిధులు చెల్లించి ఇప్పటికే ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ఆయా గ్రామాల్లో చెత్త సేకరణ పనులు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2,750 మంది పారిశుధ్య కార్మికులు ఉండగా ప్రతి గ్రామ పంచాయతీకి సగటున ముగ్గురికి పైనే పనిచేస్తున్నారు. అందులో ఒకరు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా వ్యవహరించనుండగా మిగిలిన ఇద్దరు చెత్తను ఎత్తి ట్రాక్టర్లలో పోయనున్నారు. అక్కడ నుంచి డంపింగ్‌యార్డులకు చెత్తను తరలించి తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మార్చి చివరి నాటికి అన్ని గ్రామ పంచాయతీలకు...

నల్లగొండ, నమస్తే తెలంగాణ : పల్లెలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు అక్కడ సౌకర్యాలను సైతం మెరుగు పరచాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రణాళికలో భాగంగా ప్రగతి పరుగులు పెడుతోంది. పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు తొలిదశగా చేపట్టిన పారిశుధ్యంపై దృష్టిసారించి ట్రాక్టర్లను కొనుగోలు చేసి చెత్తను ఏరివేసే కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు ముందుకెళ్తున్నారు. వీధుల్లో ఉన్న చెత్తను ట్రాక్టర్లలో పోసి అక్కడ నుంచి డంపింగ్‌యార్డులకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఇంట్లో ఉన్న చెత్తను డస్టుబిన్‌లో పోయాలని సూచిస్తు డస్టుబిన్లను సైతం ఇంటికి రెండు చొప్పున అందజేశారు. ఆ డస్టుబిన్‌లో ఉన్న చెత్తను పారిశుధ్య కార్మికులు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌ యార్డుకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు.
వందశాతం నిధులతో 387 ట్రాక్టర్లు కొనుగోలు


జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు ఉండగా ఆయా గ్రామ పంచాయతీలలో ఉన్న నిధులతో ప్రభుత్వ సూచన మేరకు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ట్రాక్టర్ల కొనుగోలు చేపట్టింది. 387 గ్రామాలకు చెందిన పాలకవర్గం పూర్తిస్థాయిలో నిధులు చెల్లించి ఇప్పటికే ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ఆయా గ్రామాల్లో చెత్త సేకరణ పనులు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2,750 మంది పారిశుధ్య కార్మికులు ఉండగా ప్రతి గ్రామ పంచాయతీకి సగటున ముగ్గురికి పైనే పనిచేస్తున్నారు. అందులో ఒకరు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా వ్యవహరించనుండగా మిగిలిన ఇద్దరు చెత్తను ఎత్తి ట్రాక్టర్లలో పోయనున్నారు. అక్కడ నుంచి డంపింగ్‌యార్డులకు చెత్తను తరలించి తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
మార్చి చివరి నాటికి అన్ని గ్రామ పంచాయతీలకు...


జిల్లాలో ఇప్పటికే 370 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగోలు పూర్తి కాగా మార్చి చివరినాటికి అన్ని పంచాయతీలకు కొనుగోలు చేసి ఇచ్చేలా అదికార యంత్రాంగం చర్యలు చేపడుతుంది. ఇండియన్‌ బ్యాంకు 75శాతం, ఎస్‌బీఐ 65శాతం చొప్పున రుణసౌకర్యం కల్పిస్తుండడంతో ఇరు బ్యాంకుల సహకారంతో మరో 340 గ్రామ పంచాయతీలలో మిగిలిన డబ్బులను చెల్లించగా ఈవారంలో ఆ గ్రామ పంచాయతీలకు సైతం ట్రాక్టర్లు రానున్నాయి. ఇక పది గ్రామాల్లో ఇప్పటికే ట్రాక్టర్లు ఉండగా మరో 107 గ్రామాల్లో ప్రస్తుతం నిధులు లేకపోగా వచ్చే నెలలో ఆయా పంచాయతీలకు వచ్చే 15వ ఆర్థికసంఘం నిధుల ద్వారా రుణ సౌకర్యంతో తీసుకుని మార్చి చివరినాటికి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.


ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2.70 నుంచి రూ. 6.20 లక్షల వరకు...

జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలలో చిన్న పంచాయతీలకు 15 హార్స్‌ పవర్‌ కలిగిన ట్రాక్టర్‌ నుంచి పెద్ద పంచాయతీలకు 45 హార్స్‌ పవర్‌ కలిగిన ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు కనిష్టంగా రూ.2.70 లక్షల నుంచి రూ.6.20 లక్షల వరకు గరిష్టంగా వెచ్చిస్తున్నారు. ట్రాక్టర్ల కొనుగోలు అనంతరం ట్రాలీ కోసం ఇప్పటికే ఎంపిక చేసిన 16 ఫర్ములా ద్వారా మూడు రోజుల్లో తయారు చేసి పంచాయతీలకు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 370 ట్రాక్టర్లు కొనుగోలు చేయగా వాటిలో 30ట్రాలీలు సైతం పంచాయతీలకు అందాయి.


5 నెలలుగా నిధులు విడుదల...

పల్లె ప్రణాళికలో భాగంగా ఇప్పటికే  రెండు దఫాలుగా ఆయా గ్రామ పంచాయతీలలో ప్రగతి చర్యలు జరగ్గా ఈ ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి అయిదు నెలలుగా నిధులను విడుదల చేస్తోంది. ప్రతి నెల జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.20కోట్లు వస్తుండటంతో వాటితో పంచాయతీ కార్మికులకు వేతనాలు అందజేయడంతోపాటు పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ట్రాక్టర్ల కొనుగోలు అనంతరం వాటికి ఈఎంఐలు చెల్లించేందుకు నిధులు సైతం అందుబాటులో ఉండడం... ఆ నిధులతో ట్రాక్టర్లను నిర్వహణ చేపట్టడం, పంచాయతీ పాలకవర్గాలకు పెద్దగా ఇబ్బందిలేదు. ఇక అన్ని గ్రామాల్లోనూ డంపింగ్‌యార్డులు తప్పనిసరి చేయడంతో ఇప్పటికే 800 గ్రామ పంచాయతీల దాకా యార్డుల గుర్తింపు సైతం పూర్తయింది. వాటిల్లో నిర్మాణ పనులు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం కాగా త్వరలో అన్నింటిని పూర్తి చేసేలా చర్యలు జరుగుతున్నాయి.


logo