శనివారం 28 మార్చి 2020
Nalgonda - Feb 10, 2020 , 02:22:42

185 నామినేషన్ల తిరస్కరణ

185 నామినేషన్ల తిరస్కరణ
  • 14 డైరెక్టర్లు ఏకగ్రీవం
  • నేడు ఉపసంహరణకు తుది గడువు
  • ముగిసిన సహకార నామినేషన్ల పరిశీలన
  • మరో 15 స్థానాలపై నేడు ప్రకటన

నీలగిరి: సహకార ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ఆదివారం ముగిసింది. జిల్లావ్యాప్తంగా 42సహకార సంఘాల పరిధిలోని 546 డైరెక్టర్‌ స్థానాలకు 2189నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిని సహకార ఎన్నికల అధికారులు ఆదివారం పరిశీలన చేయగా 185 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించగా 2004 నామినేషన్లు ఆమోదించబడ్డాయి. ఒక డైరెక్టర్‌ స్థానానికి ఒక్కరే నామినేషన్‌ వేయడంతో వాటిని ఏకగ్రీవంగా ప్రకటించారు. మరికొన్ని చోట్ల ఇద్దరు అభ్యర్థులు నామినేషన్‌ వేయడంతో ఒకరు తిరస్కరించడంతో మరొకరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. జిల్లాఅంతటా సుమారు 14మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 15 మంది డైరెక్టర్‌ స్థానాలకు ఒక్కరే రెండుసెట్లు వేయడంతో వారిని కూడా నేడు అధికారికంగా ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు. ఒక్కో అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్లు దాఖలుచేయడంతో ఒక నామినేషన్‌నే పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 2004నామినేషన్లు వేసినట్లు సహకార అధికారులు ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరిగడువు ఉండటంతో మరికొన్ని వార్డులు కూడా ఏకగ్రీవంకానున్నాయి.రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఆదేశాల ప్రకారంగా నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగియడంతో అదివారం పరిశీలన కార్యక్రమం చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 42 సహకార సంఘాల పరిధిలో కేటాయించిన ఎన్నికల అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లను మూడు రోజలపాటు  2189 నామినేషన్లు స్వీకరించారు. 42సహకార  సంఘాల్లో 2189మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 


ఏకగ్రీవమైన డైరెక్టర్‌ స్థానాలు ఇవే..

546 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా అందులో 11 డైరెక్టర్లకు ఒకేఒక్క నామినేషన్‌  దాఖాలు అయింది. దీంతో వీటిని సహకార ఎన్నికల అధికారులు ఆదివారం ఏకగ్రీవంగా ప్రకటించారు. చిట్యాల మండలం వెల్మినేడ్‌ సహకార సంఘ పరిధిలో 10వ వార్డు,  శాలిగౌరారం సహకార సంఘంలో 2 వార్డు, శివన్నగూడెంలో 7,8 వ వార్డు స్ధానాలు, వేములపల్లి మండలంలోని సల్కూనూర్‌ సహకార సంఘంలో 4,8,12,13 స్ధానాలు, మిర్యాలగూడ మండలంలో బి.అన్నారం సహకారసంఘంలో 11వ వార్డు , పీడీపల్లి 6వవార్డు, బాబుసాయిపేటలో 8వ వార్డు అభ్యర్థులు ఒకేఒక్క నామినేషన్‌ వేశారు. ఎల్లారెడ్డిగూడెం సహాకార సంఘం 9వ వార్డు, మర్రిగూడ సంఘంలో 1వార్డు, పెద్దవూర సంఘంలో 4వార్డులను ఒకే ఒక నామినేషన్‌ రావడంతో వాటిని ఏకగ్రీవంగా ప్రకటించారు. ఇవిగాకుండా మరో 15డైరెక్టర్‌ స్థానాలు ఒకే అభ్యర్ధి 2సెట్ల నామినేషన్‌ దాఖలు చేయగా ఆ రెండు కూడా ఆమోదించబడటంతో ఉపసంహరణ గడువు అనంతరం ఒకే నామినేషన్‌ పరిగణలోకి తీసుకుని ఏకగ్రీవం చేయనున్నారు. 


2004 నామినేషన్లు ఆమోదం..

జిల్లాలో 42 సహకార సంఘాల పరిధిలోని 546 డైరెక్టర్‌ స్థానాలకు గాను 2189 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. వాటిలో ఒక్కో అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్లు వేయగా వాటిలో ఒక్కటి మాత్రమే పరిగణిలోకి తీసుకున్నారు. తిరస్కరించినవి, డబుల్‌ నామినేషన్లు పోగా 2004 మంది పోటీలో ఉన్నారు. ఇందులో మరో 15నామినేషన్లు ఒక్కరే వేయడంతో వాటిని కూడా నేడు ఉపసంహరణ అనంతరం ఏకగ్రీవం చేయనున్నారు. పోటీలో ఉన్న వివరాలు సహకార సంఘం వారిగా ఇలా ఉన్నాయి.  గొల్లగూడలో 61, శాలిగౌరారంలో 42, తాటికల్‌లో 61, కేతేపల్లిలో 63 ,తిప్పర్తిలో 55, కనగల్‌లో 36 , జీఎడవల్లిలో 36, చండూరులో 64 , మునుగోడులో 44, చిట్యాలలో41, గుండ్రాంపల్లిలో 47, వెలిమినేడు 40 , నార్కట్‌పల్లి 32, ఎల్లారెడ్డిగూడ 35, సల్కునూర్‌34, వేములపల్లి 36, శెట్టిపాలెం38, తడకమల్ల 41, ఆలగడప 61, మిర్యాలగూడ43, తుంగపాడ్‌ 37, బి. అన్నారం32, దామరచర్ల71, త్రిపురారం 46, పీడీపల్లి 33, బాబాసాయిపేట 38, నిడమనూరులో 50, వెనిగండ్ల 32, పెద్దవూర 70, కొత్తపల్లి 64, దేవరకొండ 89, డిండి 40, తవక్లాపూర్‌ 43, పీఏపల్లి 60, ఎం.మల్లేపల్లి 57, గడియగౌరారం 64, చింత్రియాల 50, తిమ్మాపూర్‌ 45, నాంపల్లి 55, గుర్రంపోడు 45, మర్రిగూడ 40, శివన్నగూడెం 33నామినేషన్లు దాఖలయ్యాయి.


logo