సోమవారం 30 మార్చి 2020
Nalgonda - Feb 09, 2020 , 01:18:35

85.16 లక్షల మొక్కలు నాటాలి

85.16 లక్షల మొక్కలు నాటాలి
  • వివిధ శాఖలు హరిత లక్ష్యాన్ని పూర్తి చేయాలి
  • హరితహారం సమన్వయ సమావేశంలో లక్ష్యం ఖరారు
  • కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్లగొండ, నమస్తేతెలంగాణ: జిల్లాలో 2020-21లో 85.16 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు.  శనివారం తెలంగాణకు ‘హరితహారం’పై జిల్లా స్థాయి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంను కలెక్టరేట్‌లో నిర్వహించారు. తొలుత 2020లో నర్సరీ, మొక్కలు నాటే లక్ష్యంపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 2019-20లో కోటి 10లక్షల16వేల మొక్కలు నర్సరీల్లో పెంచాలని లక్ష్యం నిర్ణయించగా, 2020-21లో 85.16 లక్షల మొక్కలు నాటాలన్నారు. గ్రామీణాభివృద్ధ్ది శాఖతో 2020లో నర్సరీల్లో 70.66 లక్షల మొక్కలు పెంచాలని, ఇందులో నర్సరీలో 62.66 లక్షలు, కన్వర్షన్‌ 8లక్షల మొక్కలుగా నిర్ణయించారు.  టేకు, ఈత, హోమ్‌ స్టెడ్‌ మొక్కలు నాటాలన్నారు. ఐసీడీఎస్‌శాఖ ద్వారా 10వేలు, అటవీశాఖ ద్వారా 20లక్షలు, ఇతర శాఖల ద్వారా 20లక్షలు నాటాలని నిర్ణయించారు. 2020 జూన్‌లో అటవీశాఖ ద్వారా 2లక్షలు హరిత వనాలుగా అటవీ భూముల్లో నాటేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించారు.  వ్యవయశాఖ 3లక్షలు టేకు, 50వేలు వెదురు చెట్లు, ఎక్సైజ్‌కు 3లక్షలు, మైనర్‌ ఇరిగేషన్‌కు లక్ష, అదే విధంగా మున్సిపాల్టీలకు మొక్కలు నాటాలన్నారు. సమావేశంలో డీఎఫ్‌ఓ శాంతారాం, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి శేఖర్‌రెడ్డి, డీఈఓ భిక్షపతి, ఐసీడీఎస్‌ అధికారి సుభద్ర, మైనర్‌ ఇరిగేషన్‌ డిప్యూటీ ఈఈ శంకర్‌రెడ్డి తదితరులున్నారు.


జిల్లా కేంద్ర దవాఖానను  తనిఖీ చేసిన కలెక్టర్‌

నీలగిరి: జిల్లా కేంద్ర దవాఖానను కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ దవాఖానలోని ఐసీయూ, డయాలసిస్‌, వెయింటింగ్‌రూము, పురుఫుల, స్త్రీల వార్డులు, ఎంసీహెచ్‌ బ్లాక్‌, లేబర్‌ రూము, అపరేషన్‌ థియేటర్‌, నవజాతశిశువు కేంద్రం, మెడికల్‌ కళాశాల సెంట్రల్‌ లైబ్రరీ, పిల్లల వార్డులను  కలెక్టర్‌ పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. డబ్బులు ఎవరైనా అడుతున్నారా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.  ఎంసీహెచ్‌ బ్లాక్‌లో ఖాళీగా ఉన్న స్థ్ధలంలో మరుగుదొడ్లు, కార్పెట్‌ గ్రాస్‌, మొక్కలను పెంచి అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం రూ.10 భోజనంపై విచారణ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు, దవాఖానలకు పావురాలు రాకుండా డోమ్‌లను ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అనంతరం దవాఖాన, మెడికల్‌ కళాశాల డాక్టర్లతో సమావేశం నిర్వహించారు.  సమావేశంలో దవాఖాన సూపరింటెండెంట్‌ నర్సింహ, వైస్‌ ప్రిన్సిపాల్‌ జితేందర్‌, మౌలిక సదుపాయాల సంస్థ్ధ ఈఈ ఆజీజ్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ కృష్ణయ్య, పబ్లిక్‌ ఈఈ కందుకూరి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. logo