శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 09, 2020 , 01:18:03

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

రామగిరి: లోక్‌ అదాలత్‌లో రాజీచేసుకున్న కేసులకు తిరిగి అప్పీలు చేసుకునే అవకాశం ఉండదని..  ఇదే అంతిమ తీర్పుఅని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా  న్యాయసేవాధికార సంస్థ్ధ అధ్యక్షుడు ఎంవీ రమేశ్‌ తెలిపారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘జాతీయ లోక్‌ అదాలత్‌'ను ఆయన జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాధికార  సంస్థ్ధలో ప్రారంభించి మాట్లాడారు. కక్షిదారుల సమ్మతిమేరకు అన్ని రకాల సివిల్‌కేసులు, రాజీపడదగిన క్రి మినల్‌ కేసులు  పరిష్కరించడంతోపాటు సమ యం, డబ్బు ఆదా అవుతుందన్నారు. మోటారు వాహనాలతో ప్రమాదాలకు గురైన కేసులతో పాటు చెల్లని చెక్కులకేసులు, బ్యాం కురంగాల కేసు లు, కుటుంబ వివావాదాల కేసులు పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా లోక్‌అదాలత్‌లో సత్వర న్యా యం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు, న్యాయమూరులు ఎం.భవానీ, ఎం.వెంకటేశ్వర్‌రావు, వి.మాధవీలత, పీపీ జి.వెంకటేశ్వర్లు, న్యా యవాదులు నగేశ్‌, గోలి అమరేందర్‌రెడ్డి, లెనిన్‌బాబు, నిమ్మల బీమార్జున్‌రెడ్డి, సరోజ తదితరులు పాల్గొన్నారు.


logo