శనివారం 28 మార్చి 2020
Nalgonda - Feb 08, 2020 , 03:12:29

జిల్లా ఓటర్లు @13,64,271

జిల్లా ఓటర్లు @13,64,271
  • ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి
  • పోలింగ్‌ స్టేషన్లలో తుది జాబితా ప్రదర్శన
  • కలెక్టరేట్‌లో పరిశీలించిన కమిషనర్‌ అనితా రాజేంద్ర
  • దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన పూర్తి
  • పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికం

నల్లగొండ, నమస్తే తెలంగాణ :  2020 సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో ఓటరు తుది జాబితాను అధికార యంత్రాం గం శుక్రవారం ప్రకటించింది. 1741 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 6,80,795 మంది పురుష ఓటర్లుండగా , 6,83,458 మంది స్త్రీ ఓటర్లు, 18మంది ఇతరులున్నారు. మొత్తం 13,64, 271 మంది ఓటర్లుగా తేలారు. అత్యధికంగా నకిరేకల్‌లో 2,34,730 మంది ఓటర్లుండగా అత్యల్పంగా నాగార్జునసాగర్‌లో 2, 16,755 మంది తేలారు. ఇక జిల్లా వ్యాప్తంగా పురుషుల కంటే స్త్రీలే 2663 మంది ఎక్కువగా ఉన్నా రు.  అభ్యర్థుల భవితవ్యాన్ని మహిళా ఓటర్లే తేల్చనున్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఓటర్‌ జాబితా పరిశీలకురాలు, అనితా రాజేంద్ర జాబితాను పరిశీలించారు. 


logo