సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 08, 2020 , 03:11:51

అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న వ్యక్తిపై కేసు

అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న వ్యక్తిపై కేసు

మాల్‌ : చింతపల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాలుకు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదైంది. చింతపల్లి మండల కేంద్రంలోని సర్వే నెం.149లో నూతనంగా నిర్మిస్తున్న ఫంక్షన్‌హాలుకు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తుండడంతో మైనింగ్‌, రెవెన్యూ అధికారులకు స్థానికులు సమాచారం అందజేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు ఫంక్షన్‌హాల్‌ యజమాని కొవ్వూరి నర్సింగ్‌రావుపై కేసు నమోదు చేసినట్లు మండల ఆర్‌ఐ నర్సింహ తెలిపారు. వారి వెంట రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 


logo