శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 07, 2020 , 02:10:19

ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరిక

ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరిక

హాలియా, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తు న్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. గురువారం హాలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో నిడమనూరు మండలం సూరెపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాకప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చాపల సొసైటీ చైర్మన్‌ ఆవుల సీతారాములు, సహకార సొసైటీ డైరెక్టర్‌ జానకిరాములు, కాంగ్రెస్‌ యూత్‌ అధ్యక్షుడు జానపాటి సైదయ్య, అంబటి సైదయ్యనాయుడు, రావుల శేఖర్‌, ఆవుల రాంబాబుతోపాటు మరికొంత మంది కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో నిడమనూరు మాజీ ఎంపీపీ చేకూరి హన్మంతరావు, జిల్లా నాయకులు కేవి.రామారావు, తాటి సత్యపాల్‌, పోలె డేవిడ్‌, కట్టెబోయిన గురువయ్యయాదవ్‌, ఉన్నం సత్యనారాయణ, నలబోతు వెంకటేశ్వర్లు, జూలకంటి అప్పారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  


భాస్కర్‌రావు సమక్షంలో చేరిక

మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ : మండలంలోని యాద్గారపల్లి గ్రామానికి చెందిన మల్లబోయిన నాగేందర్‌తో పాటు 50 మంది కార్యకర్తలు ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ డి.శ్రీనివాస్‌, బాసాని గిరి, బంటు రమేష్‌, వేణుగోపాల్‌రెడ్డి, డైమండ్‌ చిన్న, సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రామాంజి సైదులు, ఆంజనేయులు, సుధాకర్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


logo