గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 06, 2020 , 01:56:52

అశ్వవాహనంపై పార్వతీ సమేతుడై..

అశ్వవాహనంపై పార్వతీ సమేతుడై..
  • ఘనంగా శత కలశాభిషేకం
  • నేడు గ్రామోత్సవంతో జాతర ముగింపు

నార్కట్‌పల్లి : చెరువుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఘనంగా అశ్వవాహన సేవ నిర్వహించారు. అశ్వవాహనంపై పార్వతీపరమేశ్వరులు కొండప్రాంతంలో విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం మహా మండపం వద్ద 108 కలశాలచే అభిషేకం ని ర్వహించారు. అనంత రం మన్యుసూక్త హో మం, బలిహారణ, జయాదిహోమం, ధ్వజారోహణం, త్రిశూల స్నానం, వసంతోత్సవం నిర్వహించారు. అంతకు ముం దు ఉత్సవ మూ ర్తులకు చందనాభిషేకం, క్షేత్ర పాలక కాలభైరవుడికి అభిషేకాలు జరిపారు. అదే విధంగా స్వామివారికి వైభవంగా పుష్పోత్సవం, ఏకాంత సేవలు నిర్వహించారు. ఆలయ ప్రధానర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ ఈఓ సులోచన, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, దేవాలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


నేడు గ్రామోత్సవం..

బ్రహోత్సవాల ముగింపు సందర్భంగా నేడు గ్రామో త్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెరువుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామిని గజవాహనపై ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ సులోచన, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ తెలిపారు. logo
>>>>>>