బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 06, 2020 , 02:05:45

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
  • ఈ నెల 8వరకు సహకార నామినేషన్ల స్వీకరణ
  • ఈ సారి ఫొటోలు లేకుండానే బ్యాలెట్‌ పత్రాలు
  • ఎన్నికల విధులకు అధికారులతో పాటు అసిస్టెంట్ల నియామకం
  • 1638మంది సిబ్బందికి 8న ప్రత్యేక శిక్షణ

నీలగిరి : సహకార ఎన్నికల్లో తొలి ఘట్టం నేటి నుంచి ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా 42 సహకార సంఘాల పరిధిలోని 546 డైరెక్టర్‌ స్థ్ధానాలకు సహకార ఎన్నికల అథారిటి నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో గురువారం నుంచి జిల్లాలో సహకార అధికారులు నామినేషన్లు స్వీకరించ నున్నారు. మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించి 9న వాటిని పరిశీలించి 10న ఉపసంహరణకు గడువు విధించారు. అనంత రం బరిలో నిలిచిన అభ్యర్థ్ధుల పేర్లు ప్రకటించి గుర్తులు కేటా యిస్తారు. 


 1638 మంది సిబ్బంది నియామకం..

జిల్లాలో 42 సహకార పరిమితి సంఘాల పరిధిలోని 546 డైరెక్టర్ల స్థ్ధానాలకు ఫిబ్రవరి 15 జరుగనున్న ఎన్నికలకు సహకార అధికారులు 1638మంది సిబ్బంది అవసరం ఉన్నట్లు గుర్తించారు. ప్రతి డైరెక్టర్‌కు పీఓ, ఏపీఓ, ఓపీ ఓలు ముగ్గురిని కేటాయించారు. వీరు కాకుండా మరో 170 మందిని సైతం విద్యాశాఖ నుంచి తీసుకున్నారు. వీరిందరికి ఎన్నికల నిర్వహణపై ఈ నెల 8న ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ సహకార ఎన్నికల అథారిటిలో శిక్షణ పొందిన మాస్టర్‌ ట్రైనర్లు వీరికి శిక్షణ ఇస్తారు. 


ఫొటోలు లేకుండానే బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ..

సహకార సంఘాల డైరెక్టర్‌ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థ్ధులు ఈ నెల 10న ఖరారు కానుండడంతో అదేరోజు సాయంత్రం వారికి గుర్తులు కేటాయిస్తారు. ఇందుకు ఎన్నికల సంఘం సుమారు 20 రకాల గుర్తులను సైతం ఎంపిక చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థ్ధులకు తెలుగు అక్షరమాల ప్రకారంగా వరుసలు కేటాయించి గుర్తులు ప్రకటిస్తారు. గతంలో జరిగిన ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలపై పోటీ చేసిన అభ్యర్థుల ఫొటోలు ముద్రించా రు. కానీ సమయం తక్కువగా ఉండడం, సాఫ్ట్‌వేర్‌ ఆలస్యం, నెట్‌లో డౌన్‌లోడ్‌ సమస్యలు తతెత్తుతున్న కారణంగా ఫొటోలను తొలగించినట్లు సహకార అధికారి ఒక్కరు సమస్తేతో చెప్పారు. ఖచ్చితంగా అభ్యర్థ్ధుల ఫొటోలు లేకుండానే బ్యాలెట్‌ పత్రాలు ముద్రించనున్నట్లు తెలిపారు. 


logo