గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 06, 2020 , 01:53:35

‘పెద్ద మేస్త్రీ’ ఆడియో, వీడియో రిలీజ్‌

‘పెద్ద మేస్త్రీ’ ఆడియో, వీడియో రిలీజ్‌

నల్లగొండ కల్చరల్‌: ప్రముఖ సినీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జీఎంసీ టెలివిజన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన పెద్ద మేస్త్రీ ఆడియో, వీడియో సాంగ్‌ను బుధవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పట్టణంలోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇష్టంతో తన తండ్రి మేస్త్రీ కష్టాలను పెద్ద మేస్త్రి రూపంలో చరణ్‌ అర్జున్‌ రూపొందించడం ప్రశంసనీయమన్నారు. సాధారణంగా తండ్రికి తమ కొడుకు తమకన్నా ఉన్నతస్థాయికి చేరుకుంటే సంతోషిస్తారన్నారు. చరణ్‌అర్జున్‌ తన తండ్రినే మేస్త్రి పాత్రలో హీరోగా పెట్టి వీడియో, ఆడియో చిత్రీకరించడం గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో యువత ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆలోచింపచేసే రీతిలో సినిమా రూపొందించాలని ఎమ్మెల్యే కోరారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌ మాట్లాడుతూ తన తండ్రి వృత్తిని గొప్పగా పెద్ద మేస్త్రీ రూపంలో చిత్రీకరించినందుకు ఆనందంగా ఉందన్నారు. పుట్టిన నల్లగొండ గడ్డ మీద ఉన్న ప్రతి కళాకారున్ని ప్రోత్సహించి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు.


అంతకుముందు చరణ్‌ అర్జున్‌ బయోగ్రఫితో పాటు అతను రాసిన గీతాలను బిగ్‌ స్క్రీన్‌లో ప్రేక్షలకులకు చూపించారు. ఈ సందర్భంగా చరణ్‌ అర్జున్‌, నల్లగొండ గద్దర్‌ నర్సిరెడ్డి ఆలపించిన గేయాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మందడి నర్సిరెడ్డి, నల్లగొండ ఎంపీపీ మనిమద్దె సుమన్‌, మేళ్లదుప్పలపల్లి సర్పంచ్‌ పద్మావతి, బోనగిరి దేవేందర్‌, బోగరి అనిల్‌కుమార్‌, కొండేటి మల్లేశం, ఇస్తారి, లక్ష్మీనారాయణ, అంబటి వెంకన్న, గీత, బట్టు నవీన్‌ పాల్గొన్నారు.logo
>>>>>>