శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 06, 2020 , 01:49:45

మైత్రి కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలి

మైత్రి కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలి

నీలగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మైత్రి కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి గల వారు ఈనెల 13 లోగా పశు సంవర్ధక శాఖ అధికారి, కేంద్రీకృత వీర్యసేకరణ కేంద్రం పానగల్‌ రోడ్డులో దరఖాస్తు చేసుకోవాలని కార్యనిర్వాహక అధికారి మల్లికార్జున్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు 10వ తరగతి ఉత్తీర్ణులై 18నుంచి 35 సం.లు కలిగి కృత్రిమ గర్భధారణలో సాంకేతిక శిక్షణ పొందిన వారు, సంబందిత కేంద్రానికి సమీప గ్రామాల అభ్యర్థులు ఫొటో, స్థానిక నివాస ధ్రువీకరణపత్రం, ఆధార్‌, రేషన్‌కార్డులతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మైత్రి కేంద్రాలు ఉమ్మడి జిల్లాలో ఈ విధంగా ఉన్నాయి.


నల్లగొండ : గూడూర్‌-మిర్యాలగూడ, నేతాపురం-టి.సాగర్‌, చింతలపాలెం-టీ.సాగర్‌, శ్రీరాంపల్లి-టి.సాగర్‌, పోలెపల్లి-చందంపేట, చింత్రియాల-చందంపేట, పేర్వాల-నేరడుగొమ్మ, వీరబోయినపల్లి-గుండ్లపల్లి, విజమూరుగేటు-చింతపల్లి, పాల్వాయి-గుర్రంపోడు, తుర్కపల్లి-కనగల్‌, కాచరాజుపల్లి-నేరెడిగొమ్ము, ముడుదండ్ల-చందంపేట, పోగిల్ల-చందంపేట, కేశినేనిపల్లి-పీఏపల్లి, పంగవానికుంట-అనుముల, ఎర్రచెర్వుతండా-టి.సాగర్‌, కోనేటిపురం-టి.సాగర్‌, కుంకుడుచెట్టుతండా-పెద్దవూర, గణపతివారిగూడెం-మాడ్గులపల్లి, కంచనపల్లి-నల్లగొండ, ఉప్పలపాడ్‌-కేతేపల్లి, అన్నారం-మిర్యాలగూడ, దొండవారిగూడెం -మిర్యాలగూడ, షాపల్లి-నార్కట్‌పల్లి, ఆకారం -శాలిగౌరారం, మనిమద్దె-శాలిగౌరారం, మాటూర్‌-త్రిపురారం.


logo