బుధవారం 01 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 05, 2020 , 02:32:02

ఇంటర్మీయట్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ఇంటర్మీయట్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

నల్లగొండ, నమస్తే తెలంగాణ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఇన్‌చార్జి డీఆర్వో జగదీశ్వర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై వివిధశాఖల అధికారులతో ఏర్పాటు చేసి ఆయన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 4 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్‌ స్కాడ్‌ బాధ్యతల నిర్వహణకు రెవెన్యూశాఖ ఇద్దరు తాసిల్దార్‌ అధికారులను నియమించాలని కోరారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించాలని కోరారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను పరీక్ష సమయంలో మూసి వేయాలన్నారు. రూట్‌ అధికారులు ఎస్కార్టు ప్రశ్నపత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల నుంచి జవాబు పత్రాలు వచ్చే డిస్ట్రిబ్యూషన్‌ రిసెప్షన్‌ కేంద్రం వద్ద భద్రత ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునేలా  బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వైద్యశాఖ అధికారులను కోరారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా డీఈఓకు సూచించారు. సమావేశంలో ఇంటర్మీడియట్‌ అధికారి భానునాయక్‌, డీపీఆర్వో శ్రీనివాస్‌, డీఈఓ భిక్షపతి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>