శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 03, 2020 , 03:10:26

సహకార సంఘాల డైరెక్టర్ల రిజర్వేషన్లు ఇవే..

 సహకార సంఘాల డైరెక్టర్ల రిజర్వేషన్లు ఇవే..

మిర్యాలగూడ రూరల్‌ : మండలంలోని ఐదు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) ఐదు ఉన్నాయి. ఐదు సంఘాల్లో  65వార్డులు  8,178 మంది  ఓటర్లున్నారు. వీటికి ఎన్నికలు నిర్వహణకు ఇటీవల ప్రకటన వెలువడనుండటంతో ఓటర్ల జాబితా, సంఘాల డైరెక్టర్ల రిజర్వేషన్ల కేటాయింపు పనిలో అధికారులు బీజీగా మారారు. రెండురోజులు పాటు కసరత్తు చేసి రిజర్వేషన్లు ఖరారు చేశారు. నేడు నోటిఫికేషన్‌ వెలువడనుంది. మండలంలో బి.అన్నారం సహకార సంఘం పరిధిలో 665 మంది ఓటర్ల ఉండగా 13స్థానాలు సభ్యులు ఉన్నారు. ఇందులో  వార్డులు 1,3,4,10,11,12,13 ఓసీ జనరల్‌, 2వ వార్డు ఓసీ మహిళ కేటాయించారు. అదేవిధంగా 5వ వార్డు ఎస్సీ జనరల్‌, 8 ఎస్సీ మహిళ,  6,7 వార్డులు బీసీ జనరల్‌, 9వార్డు  ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. మిర్యాలగూడ పీఏసీఎస్‌  పరిధిలో  1099 మంది ఓటర్లు ఉండగా  13 వార్డులుఉన్నాయి. వాటిలో 28,9,10,11,13 వార్డులు ఓసీ జనరల్‌, 3 ఓసీ మహిళ,1,5వార్డులు బీసీ,     7వార్డు  ఎస్సీ జనరల్‌, 4వ వార్డు ఎస్సీ మహిళ, 12వ వార్డు  ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. అదేవిధంగా తడకమళ్ల     పీఏసీఎస్‌లో 2548మంది ఓటర్లు ఉండగా 13 డైరెక్టర్లు వార్డు సభ్యులు ఉన్నారు. అందులో 1,2,3,8,10,13 వార్డులను జనరల్‌, 12 వార్డును ఓసీ  మహిళ, 4,5 వార్డులు బీసీ జనరల్‌, 11వార్డును  ఎస్సీ జనరల్‌, 9వ,  6వ వార్డును  ఎస్టీ జనరల్‌కు ఖరారు చేశారు. ఆలగడప పీఏసీఎస్‌ పరిధిలో 3,328 మంది ఓటర్లు ఉండగా 13వార్డులుగా విభజించారు. అందులో 1,2,4,7,11,12,13 వార్డులు జనరల్‌ కు కేటాయించాగా, 3వ, వార్డు జనరల్‌ మహిళకు కేటాయించారు. అదేవిధంగా 5,6 వ, వార్డులను  బీసీలకు కేటాయించారు. 8వ వార్డు ఎస్సీ జనరల్‌, 9వ వార్డు ఎస్సీ మహిళ, 10 వార్డు ఎస్టీకి రిజర్వు చేశారు. అదేవిధంగా తుంగపహాడ్‌ సహకార సంఘం పరిధిలో 538 ఓటర్లు ఉండగా 13వార్డు సభ్యులుగా నిర్ణయించారు. అందులో 1, 4వ వార్డులు ఓసీ మహిళ, 6, 8, 10, 11, 12, 13 వార్డులు జనరల్‌ కేటగిరి , 5వార్డు ఎస్సీ జనరల్‌ , 2 వార్డు ఎస్సీ మహిళ, 3 వార్డు బీసీ 7 వార్డు ఎస్టీ కేటగిరికి కేటాయించారు. logo