గురువారం 09 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 03, 2020 , 03:07:03

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం దామరచర్ల సల్కునూరు, వేములపల్లి, శెట్టిపాలెం ప్రాథమిక సహకార సంఘాల పరిధిలోని ముఖ్య నాయకులతో పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాల ఎన్నికల్లో ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన వారినే డైరెక్టర్లుగా బరిలో దింపాలని సూచించారు. సంఘాల పరిధిలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పని చేసి డైరెక్టర్‌ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, మోషీన్‌అలీ, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, చిర్రమల్లయ్యయాదవ్‌, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, స్కైలాబ్‌నాయక్‌, కుందూరు వీరకోటిరెడ్డి, మారుతి వెంకట్‌రెడ్డి, గౌరు శ్రీనివాస్‌, బండి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.


logo