మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Feb 02, 2020 , 04:13:40

సాగర్‌ నీటిమట్టం 553.80 అడుగులు

సాగర్‌ నీటిమట్టం 553.80 అడుగులు

నందికొండ : నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రసుత్తం 553.80 అడుగులు (217.5855 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌ డ్యాం నుంచి కుడి కాల్వ ద్వారా 2327 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 9812 క్యూసెక్కులు,  ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2200 క్యూసెక్కులు, డీటీ గేట్ల ద్వారా 10 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు మొత్తం 14649 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 870.10 అడుగులు(142.0164 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం నుంచి నాగార్జునసాగర్‌కు 14649 క్యూసెక్కుల  ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.  


మూసీ కాల్వలకు నీటి విడుదల నిలివేత

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు శనివారంనుంచి నీటి విడుదలను నిలిపివేశారు. యాసంగి పంటల సాగుకు గత నెల 19న అధికారులు రెండో విడుత నీటిని విడుదలను ప్రారంభించగా గడువు ముగియడంతో నిలిపివేశారు. మూడవ విడుత నీటి విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులు కాగా ప్రస్తుతం 631.20(1.55 టీఎంసీలు)అడుగులుగా ఉంది.  logo
>>>>>>