మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Feb 01, 2020 , 02:56:01

చెర్వుగట్టుకు ఉత్సవ శోభ

చెర్వుగట్టుకు ఉత్సవ శోభ
  • ఈనెల 6 వరకు బ్రహ్మోత్సవాలు
  • హాజరుకానున్న మండలిచైర్మన్‌ గుత్తా, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి
  • నేటి అర్ధరాత్రి అనంతరం స్వామివారి కల్యాణం

నార్కట్‌పల్లి : జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రం గా పేరొందిన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం విద్యుత్‌ వెలుగులతో ఉత్సవ శోభను సంతరించుకుంది. ఇప్పటికే గట్టుపై, గట్టకింద ఆలయాలు విద్యుత్‌  దీపాలతో అలంకరించారు. నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై చె ర్వుగట్టు దేవస్థానం విద్యుత్‌ దీపాలతో దగదగలాడుతుంది. మార్గమధ్యలోని ఎల్లారెడ్డిగూడెం వద్ద ఏర్పా టు చేసిన ఆర్చిని ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది అలంకరించడంతో భక్తులను ఆకట్టుకుంటుంది. గట్టకింద శివుడి రూపంలో విద్యు త్‌ రూపాలతో భారీ కటౌట్‌లు కూడా ఏర్పాటు చేశారు. నంది విగ్రహాలకు సై తం విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. 


నేడు స్వామివారి కల్యాణం

పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంపై నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం విద్యుత్‌ దీపాలతో విరాజిల్లుతుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు (ఆదివారం తెల్లవారుజామున) స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. స్వామివారి కల్యాణానికి శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వం తరపున తలంబ్రాల బియ్యం, పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు ఈఓ సులోచన తెలిపారు. దేవస్థానంపై భక్తులకు శాశ్వత నిత్యాన్నదాన పథకాన్ని ఏర్పాటు చేశారు. రోజూ 2 నుంచి 3 వేల మంది భక్తులు ఉచిత అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


ఏర్పాట్లు పూర్తి

గట్టుపై భక్తులకు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నూతనంగా మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు, చలువ పందిళ్లు వేశారు. దేవస్థానం విద్యుత్‌ దీపాల రంగులతో భక్తులను ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకున్నాయి. గుట్టపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా ఇరువైపుల రేలింగ్‌ సదుపాయాలు కర్రలతో కట్టారు. భక్తులకు కొబ్బరికాయలు, లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు సిద్ధ్దం చేసినట్లు అధికారులు తెలిపారు. వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా గుట్టకింద స్థలాన్ని కేటాయించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు శాంతి భధ్రతల పరిరక్షణకోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థ కూడా వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తుంది. 


logo
>>>>>>