శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 01, 2020 , 02:49:52

పాలకవర్గం బాధ్యతాయుతంగా పని చేయాలి

పాలకవర్గం బాధ్యతాయుతంగా పని చేయాలి

చిట్యాల : మున్సిపాలిటీ పాలకవర్గం బాధ్యతగా పని చేసి పట్టణాభివృద్ధికి కృషి చేయాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మున్సిపాలిటీ చైర్మన్‌ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌రెడ్డితోపాటు పాలకవర్గ సభ్యులు శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాప్రతినిధులు సేవాతత్పరతతో పని చేసి ప్రజాసంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. అధికారుతో సమన్వయంతో పని చేసి సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని కోరారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు చైర్మన్‌ను పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బి.లాజ ర్‌, తాసిల్దార్‌ కృష్ణారెడ్డి, ఎంపీపీ సునీత, నాయకులు జడల ఆదిమల్లయ్యయాదవ్‌, కర్నాటి ఉప్పల వెంకట్‌రెడ్డి, వెలుపల్లి మ ధుకుమార్‌, గుండెబోయిన సైదులు, మెండె సైదులు పాల్గొన్నారు.


logo