శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 01, 2020 , 02:39:54

సాగర్‌ నీటిమట్టం 553.90 అడుగులు

సాగర్‌ నీటిమట్టం 553.90 అడుగులునందికొండ : నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులకు గాను ప్రసుత్తం 553.90 అడుగుల వద్ద 218.4519 టీఎంసీల నీరు శుక్రవారం నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌ డ్యాం నుంచి కుడికాల్వ ద్వారా 2419 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 9812,  ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2200, డిటీ గేట్సు ద్వారా 10, వరదకాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జునసాగర్‌ డ్యాం నుంచి మొత్తం 14741 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండగా, ప్రధాన జల విద్యుత్‌కేంద్రం నీటి విడుదల లేదు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 870.40 అడుగులకు చేరుకొని 143.4100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం నుంచి నాగార్జునసాగర్‌కు 14741క్యూసెక్కుల  ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.


మూసీ నుంచి 250 క్యూసెక్కుల నీటి విడుదల

కేతేపల్లి : మండలంలోని మూసీ ప్రాజెక్టు ద్వారా శుక్రవారం 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు కలిపి 230 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా 20 క్యూసెక్కుల నీరు ఆవిరవుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ మమత తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఎటువంటి  ఇన్‌ఫ్లో లేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 631.47 అడుగులు (1.64 టీఎంసీలు)గా ఉంది.


logo