శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 29, 2020 , 03:43:49

విశ్వాసం నిలుపుకుంటాం

విశ్వాసం నిలుపుకుంటాం

గత ఎన్నికలకు మించి పట్టణాల్లో కాంగ్రెస్‌ నేతలకు, ప్రతిపక్ష పార్టీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని.. మరింత ప్రగతిని కోరుకుంటూ 18మున్సిపాలిటీలకు 17స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. విద్వేషంతో వాళ్లు చేసిన ప్రతి విమర్శనూ తిప్పి కొట్టేలా జనం బుద్ధి చెప్పారని.. అయినా పరాభవం తట్టుకోలేక భౌతిక దాడులతో, మీడియా ఎదుట జిమ్మిక్కులతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి మరింత దిగజారారని మంత్రి విమర్శించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హృదయాలు గెలవలేక ఆంధ్రా ఎంపీ కాళ్లు పట్టుకొని తెచ్చుకునే స్థితికి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి దిగజారా రని.. కోమటిరెడ్డి సోదరులతో తిరగడం వల్లనేమో ఉత్తమ్‌ మానసిక స్థితిలోనూ మార్పు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

  • పట్టణ ప్రగతి కోసమే టీఆర్‌ఎస్‌ను 17స్థానాల్లో గెలిపించారు
  • కర్రు కాల్చి వాత పెట్టినా ప్రతిపక్ష నేతలకు బుద్ధి రావడం లేదు
  • పరాభవం తట్టుకోలేకనే భౌతిక దాడులతో పక్కదారి పట్టించే ప్రయత్నం
  • కోమటిరెడ్డి బ్రదర్స్‌లాగానే ఉత్తమ్‌ మానసికస్థితి మారుతోంది
  • స్థాయి మరిచి ఆంధ్రా ఎంపీ కాళ్లు పట్టుకొని తెచ్చే స్థితికి చేరారు
  • మండిపడ్డ విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

నల్లగొండ ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ : పల్లెల తరహాలో పట్టణ ప్రగతిని కోరుకునే ఉమ్మడి జిల్లా ప్ర జలు 18మున్సిపాలిటీలకు 17స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించారని.. వారి నమ్మకం నిలుపుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జి ల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నివాసం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో మరోసారి టీఆర్‌ఎస్‌కు ఘన విజయం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరోసారి ప్రతిపక్ష పార్టీల జిమ్మిక్కులు సాగలేదని.. విద్వేషంతో కూడిన ప్రతిపక్ష నేతల విమర్శలు అబద్దమని ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారని మంత్రి అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత పంచాయతీ, జిల్లా పరిషత్‌, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక.. ఇలా వరుస ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినా.. కాంగ్రెస్‌, బీజేపీలు ఈసారి మళ్లీ ఆకాశమంత ఎత్తు ఎగిరిపడ్డాయని అని చె ప్పిన మం త్రి... పల్లెలకు మించి పట్టణాల్లో మరింతగా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి సోదరులకు ప్రజలు కర్రు కాల్చి మళ్లీవాత పెట్టారని ఎద్దేవా చేశారు. 


ప్రజలను పక్కదారి పట్టించేందుకే కుయుక్తులు..

ఆరేండ్లుగా సీఎం కేసీఆర్‌ పాలనలో ఒక్క రాజకీయ కేసు కూడా లేకుండా పాలిస్తుంటే.. ఓటమిని తట్టుకోలేని కాంగ్రెస్‌ నేతలు జిల్లాలో భౌతికదాడులతో ప్రజలను ప క్కదారి పట్టించే ప్రయత్నం చేశారని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. పరాభవం తట్టుకోలేక మళ్లీ పాత పద్ధతుల్లో యాదగిరిగుట్టలో తమ మహిళా ఎమ్మెల్యే గొంగిడి సునీ త పైన.. నేరేడుచర్లలో మరో ఎమ్మెల్యే సైదిరెడ్డి పైన, చౌటుప్పల్‌లో ఇతర పార్టీల వ్యక్తుల పై, కార్యాలయాలపైన దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చే శారు. గతంలో కోమటిరెడ్డి సోదరుల మతిస్థిమితం మాత్రమే అ నుమానంగా ఉండేదని.. వారి దోస్తానమో, ఇద్దరూ ఎంపీలు కావడమో కానీ ఇప్పుడు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మానసికస్థితిలోనూ మార్పు కనిపిస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు. మొన్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక.. తాజాగా నేరేడుచర్లలో మరోసారి భంగపాటుకు గురైన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. తన స్థాయిని మరిచి అధికారులను బూతులు తిట్టారని, రికార్డులు ఉన్నా వా టిని బయటపెట్టే నీచ స్థితిలో తాము లేమని అన్నారు. 


జిమ్మిక్కులు, చిల్లర పనులు మానుకోవాలి..

తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తే ఆంధ్రా ఎంపీ కాళ్లు ప ట్టుకొని మద్దతు కోసం తీసుకొచ్చుకునే స్థితికి పీసీసీ చీఫ్‌ దిగజారారని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రా ఎంపీని తన పక్కన కూర్చోబెట్టుకొని.. తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేరేడుచర్లలో ఓటు ఎ లా కల్పిస్తారని ఉత్తమ్‌ ప్రశ్నించడాన్ని ఏమనుకోవాలని మంత్రి ప్రశ్నించారు. ఎక్స్‌అఫీషియో ఓట్లను ఉపయోగించే చట్టం తెచ్చిందే కాంగ్రెస్‌ ప్రభుత్వమని.. మీ ప్రభుత్వమని మంత్రి హితబోధ చేశారు. ఉత్తమ్‌ మానసికస్థితి మరింత విషమించక ముందే ఆపార్టీ కార్యకర్తలు, కు టుంబ సభ్యులు దవాఖానలో చూపించాలని సూచించారు. ఇప్పటికైనా కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని.. ప్రజల హృదయాలు గెలుచుకునేలా పని చేయాలని.. నోటికి ఏది వస్తే అది మా ట్లాడి, మీడియా ముందు జిమ్మిక్కులు చేసే హీనస్థితి నుంచి బయటకు రావాలని అన్నారు. విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, నల్లగొండ-సూర్యాపేట జిల్లాల మహిళా శిశుసంక్షేమ శాఖ ఆర్గనైజర్‌ మాలె శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్‌ రేఖల భ ద్రాద్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వలీ తదితరులు పాల్గొన్నారు. 


డబ్బు, కులం చూసే వ్యక్తిని కాను..

తాను డబ్బులు, కులాలతో మనుషులను చూసే వ్యక్తిని కాదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో పని చేస్తున్న అంశమే అర్హతగా పెరుమాళ్ల అన్నపూర్ణమ్మకు సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి కేటాయించామని వివరించారు. ఆమె కమిట్‌మెంట్‌ మెచ్చి.. జనరల్‌ స్థానంలోనూ దళిత మహిళకు అవకాశం కల్పించామని చెప్పారు. తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఈ విషయం చెప్పిన వెంటనే మంచి నిర్ణయమని అభినందించారని మంత్రి తెలిపారు. ‘జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయిన స్థానంలో దళిత మహిళకు కట్టబెట్టాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నార’ని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా బదులిచ్చారు.


logo