మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Jan 25, 2020 , 01:40:21

ఆడపిల్లల భద్రత అందరి బాధ్యత

ఆడపిల్లల భద్రత అందరి బాధ్యత
  • లింగవివక్షను రూపుమాపాలి
  • మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలి
  • ఇన్‌చార్జి కలెక్టర్ చంద్రశేఖర్

నల్లగొండ రూరల్: ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇన్‌చార్జి కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ అడిటోరియంలో నిర్వహించిన జాతీయ బాలిక దినోత్సవంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి మాట్లాడారు. లింగ వివక్ష కారణంతో బాలికలను కడుపులోనే చిధిమేస్తున్నటువంటి వ్యవస్థను రూపుమాపాలన్నారు. కాలానుగుణంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఆడ పిల్లలపై ఆఘాయిత్యాలు ఇంకా పెరుగడం దారుణమన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించేలా కృషిచేయడంతో పాటు వారిని వారు కాపాడుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. బాల్య వివాహాలు జరుగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు మాట్లాడుతూ చట్టాలున్నా, విజ్ఞానమున్నా మనిషిలో మార్పులేనట్లయితే మనిషి నాగరిక సంఘ జీవనానికి అర్థ్ధం ఉండదన్నారు. ఆడ పిల్లలపై ఆకృత్యాలు సమాజం సిగ్గు పడేలా ఉందని, చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలన్నారు. చట్ట వ్యతిరేకంగా ఆడ పిల్లలపై అనాగరికంగా ప్రవర్తించినా చట్టం ఊరుకోదని, న్యాయ సహాయానికి న్యాయసేవా సంస్థలను ఆశ్రయించవచ్చన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సుభద్ర, సీడీపీఓ నిర్మలా, మహిళా శక్తి కేంద్రం కోఆర్డినేటర్ సునీత, ఐసీపీఎస్ గణేశ్, తదితరులు పాల్గొన్నారు. 

ఆడపిల్లలను కాపాడుకుందాం : వేణు

కనగల్ : ఆడపిల్లలను కాపాడుకొని, వారి హక్కులను పరిరక్షించాలని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవా న్ని పురస్కరించుకుని న్యాయసద స్సు  నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ సమాజంలోని పౌరులంతా ఆడపిల్లల పట్ల బాధ్యతగా ఉండాలని, లింగ వివక్షతను రూపుమాపాలని, బాలికల విద్యకు, వికాసానికి తోడ్పడాలని కో రారు. ఏఎస్పీ నర్మద మాట్లాడుతూ అగాయిత్యం కాని, టీజింగ్ కాని చేస్తే బాలికలు భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.  జిల్లా సంరక్షణ అధికారి సుభద్ర మాట్లాడుతూ ఆడపిల్లలను రక్షిస్తేనే మనిషి మనుగడకు అర్థమన్నారు.   కార్యక్రమంలో జిల్లా బాలబాలికల సంరక్షణ అధికారి గణేశ్, పాఠశాల హెచ్‌ఎం మమత, న్యాయవాదులు రవి, ఎస్ యాదయ్య, చంద్రశేఖర్‌రాజు, సీఐ సురేష్, ఎస్‌ఐ సతీష్‌రెడ్డి, చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ మహేశ్, పీఎల్వీ పరమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.logo
>>>>>>