బుధవారం 01 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 25, 2020 , 01:39:50

పేదల సంక్షేమానికి టీఆర్‌ఎస్ కృషి

పేదల సంక్షేమానికి టీఆర్‌ఎస్ కృషి
కేతేపల్లి : టీఆర్‌ఎస్ పార్టీతోనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల పరిధిలోని ఇప్పలగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు వంటల చేతన్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి సుమారు 200 మంది కార్యకర్తలు శుక్రవారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారి కి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం ఎ మ్మెల్యే మాట్లాడుతూ పాత, కొత్త అనే తేడాలేకుండా అందరూ కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ చేసిన ఉద్యమం ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యే యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు  టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ప్రతికార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇనిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారిలో మట్టిపల్లి వినోద్, ఎ.సైదులు, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు దేవరకొండ వీరయ్య, కట్ట శ్రవణ్, కోట వెంకటేశ్వర్‌రావు, కె.ప్రభాకర్‌రెడ్డి, జాల వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మార వెంకట్‌రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, నాయకులు ప్రదీప్‌రెడ్డి, కొండా సైదులుగౌడ్, సత్యనారాయణగౌడ్, వేణుమాధవరెడ్డి, సత్యనారాయణ, ధన్‌రాజ్ పాల్గొన్నారు.logo
>>>>>>