మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Jan 25, 2020 , 01:37:47

ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు ప్రత్యేక ప్రణాళిక

ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు ప్రత్యేక ప్రణాళికనల్లగొండ సిటీ : ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ యాదగిరి తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన  సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబో యే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని డిపోలు లాభాల బాట పట్టేలా ప్రణాళిక రూపొందిలన్నారు. సమ్మే కాలం తరువాత ఆర్టీసీ చార్జీలు పెంచడంతో కొంత ఆర్థిక వెసలుబాటు కలిగిందన్నారు. అక్యూపెన్సీ పెంచి మరింత లాభాలు వచ్చేలా చేస్తామన్నారు. జిల్లాకు 115నూతన ప్రైవేటు బస్సులు రానున్నాయని, ఇప్పటికే 40 బస్సులు వచ్చాయన్నారు. మిగాత బస్సు లు ఫిభ్రవరి మొదటి వారం వరకు రానున్నాయని చెప్పారు. సంస్థలో పని చేసే మహిళ కండక్టర్ల రాత్రి 8గంటల వరకు విధులు ముగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీసీలో వేల్ఫేర్‌బోర్డు ఏర్పాటు చేసి ప్రతి నాలుగు నెలలకోసారి సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. సమస్యలుంటే ఆర్‌ఏం, డీఎంల దృష్టికి తేవాలని సూచించారు. మేడారం జాతరకు రాష్ట్రవ్యాప్తంగా 4వేల బస్సులు ఏర్పాటు చేశామని 12500మంది సిబ్బందిని నియమిస్తామన్నారు. సమీక్ష సమావేశంలో ఆర్టీసీ ఆర్‌ఏం వెంకన్న, సీటీఏంఓ మునిశేఖర్, సూర్యాపేట, నల్లగొండ డీవీఎంలు కేశవులు ,శ్యామల, నల్లగొండ డీఎం సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.


logo
>>>>>>