శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 25, 2020 , 01:35:04

నిబంధనల ప్రకారం కౌంటింగ్ నిర్వహించాలి

నిబంధనల ప్రకారం కౌంటింగ్ నిర్వహించాలి


నల్లగొండ, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో అందరూ 6గంటలకే కౌంటింగ్ కేంద్రాన్ని చేరుకోవాలని సూచించారు. ప్రతీ రిటర్నింగ్ అధికారికి కేటాయించిన టేబుల్ వద్ద మూడు వార్డుల కౌంటింగ్ నిర్వహించాలని చెప్పారు. కౌంటి ంగ్ పూర్తయిన వార్డు ఫలితాలు ప్రకటించిన తర్వాతే మరో వార్డుది ప్రారంభించాలని సూచించారు. ప్రతి వార్డులోనూ మొదట పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కించి ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులు లెక్కించాలని చెప్పారు. 25బ్యాలెట్ పత్రాలను కట్టగా కట్టి లెక్కించాలని అన్నారు. రౌండ్ల వారీగా అభ్యర్థ్ది సాధించిన ఓట్లను షీట్‌లో నమోదు చేసి గెలుపొందిన వారికి ఎన్నిక ధ్రువపత్రా న్ని అందజేయాలని సూచించారు. పోస్టల్, సాధారణ బ్యాలెట్ చెల్లుబాటు ఎన్నికల నిబంధనల ప్రకారంగా నిర్ధారించాలని, కౌంటింగ్, ఫలితాల ప్రకటనలో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. ఫలితాల ప్రకటన అనంతరం బ్యాలెట్ పేపర్లు, నోటాకు నమోదైన, తిరస్కరించిన బ్యాలెట్ పేపర్లు కవర్లలో పెట్టి సీలు వేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. మున్సిపల్ కమిషనర్లు వాటిని ట్రెజరీలో భద్రపరచాలన్నారు. రాష్ట్రస్థ్ధాయి మాస్టర్ ట్రైనర్ తరాల పరమేశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని అంశాలను వారికి వివరించారు. సమావేశం లో డీఆర్వో రవీంద్రనాథ్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీవోలు జగదీశ్వర్‌రెడ్డి, రోహిత్‌సింగ్, లింగ్యానాయక్, మున్సిపల్ ప్రత్యేకాధికారులు రాజ్ కుమార్, శ్రీనివాసమూర్తి, నారాయణ స్వామి, గూడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


logo