గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 24, 2020 , 02:01:29

స్ట్రాంగ్‌ రూం వద్ద పటిష్ట భద్రత

స్ట్రాంగ్‌ రూం వద్ద పటిష్ట భద్రత
  • -కౌంటింగ్‌ ముగిసే వరకు ఆయా కేంద్రాల వద్ద బందోబస్తు
  • - శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి : ఎస్పీ రంగనాథ్‌
  • - స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌ కేంద్రాల సందర్శన

నల్లగొండసిటీ: మున్సిపల్‌ ఎన్నికల బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచిన కౌంటింగ్‌ కేంద్రం వద్ద బందోబస్తు, కౌంటింగ్‌ ఏర్పాట్లను ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పరిశీలించారు. గురువారం నల్లగొండ పట్టణంతో పాటు జిల్లాలోని మున్సిపల్‌ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పరిస్థితి ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 25న కౌంటింగ్‌ ముగిసే వరకు బందోబస్తు ఉంటుందన్నారు. జిల్లాలోని 7మున్సిపాలిటీల్లో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత చర్యలు తీసుకుంటున్నామన్నారు. అభ్యర్థులు, పార్టీల నాయకులు శాంతిభద్రతల పరిరక్షణకు  సహకరించాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐలు నిగిడాల సురేశ్‌, బాషా, రూరల్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు.
చిట్యాల : మున్సిపల్‌ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాలను భద్రపర్చిన మండల పరిషత్‌ కార్యాలయంలోని  స్ట్రాంగ్‌ రూమ్‌ను ఎస్పీ రంగనాథ్‌ గురువారం పరిశీలించారు. ఈనెల 25న ఓట్ల లెక్కింపు జరిగే వరకు బాక్సులకు తీసుకోవల్సిన జాగ్రత్తలను అధికారులు, సిబ్బందికి వివరించారు.  అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని,  ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.logo
>>>>>>