మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Jan 23, 2020 , 03:13:05

పోలింగ్ సరళి పరిశీలన

పోలింగ్ సరళి పరిశీలన


నల్లగొండ, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఓటింగ్ సరళిని ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, ఇన్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ పరిశీలించారు. మిర్యాలగూడ రోడ్డులోని ఆదిత్య స్కూల్ పోలింగ్ బూత్ పరిశీలించి ఓటింగ్ సరళి తెలుసుకున్నారు. అనంతరం ఓటర్లతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు.

వెబ్ ద్వారా పరిశీలన...

జిల్లాలోని 7 మున్సిపాలిటీలలో బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగా కలెక్టరేట్ ఎన్నికల పరిశీలకులు కొర్ర లక్ష్మి, ఇన్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ వెబ్ ద్వారా లైవ్ వీడియోలు చూస్తూ ఎన్నికలను పర్యవేక్షించారు. ఏయే మున్సిపాలిటీల్లో ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది.. అక్కడ పరిస్థితులు ఏమిటని వెబ్ ద్వారా పరిశీలించారు. వారి వెంట కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, ఇతర అధికారులు ఉన్నారు.
మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ: మున్సిపల్  ఎన్నికల పోలింగ్ సరళిని బుధవారం మిర్యాలగూడలో ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, ఇన్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ పరిశీలించారు. పట్టణంలోని ప్ర కాశ్ బాపూజీనగర్, ముత్తిరెడ్డికుంట, అశోక్ హౌసింగ్ కాలనీ, రెడ్డికాలనీ పరిధిలో పోలింగ్ బూత్ పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట ఆర్డీఓ రోహిత్ తాసిల్దార్ గణేశ్, ము న్సిపల్ కమిషనర్ వెంకన్న తదితరులు ఉన్నారు.logo
>>>>>>