శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 22, 2020 , 04:28:10

పోలింగ్ వద్ద భద్రతా ఏర్పాట్లు పూర్తి

పోలింగ్ వద్ద భద్రతా ఏర్పాట్లు పూర్తి


నల్లగొండసిటీ: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ భద్రత ఏర్పాట్లు చేశామని ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. సోమవారం ఎన్జీ కాలేజి మైదానంలో పోలీసులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు ఎలాంటి భావోద్వేగాలకు లోనుగాకుండా విధులు నిర్వహించాలన్నారు. ఇప్పటికే ఎన్నికల బూత్ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసామన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో అలజడులు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. మద్యం, డబ్బుకు లొంగకుండా ప్రజలు ఓటేయాలన్నారు. డబ్బు పంపిణీ చేస్తే సమాచారం ఇవ్వాలన్నారు. నేరచరిత్ర ఉన్న వారు పోలింగ్ ఏజెంట్ ఉండకుండా ఆయా రాజకీయ పార్టీ లు చర్యలు తీసుకోవాలన్నారు.

పోలింగ్ ఏజెంట్లను తనిఖీ చేసిన తర్వాతే వారిని అనుమతించాలన్నారు. ఓటర్లను పురుషులు, మహిళల లైన్లలో ఏర్పాటు చేయాలన్నారు. పోలీసులు ఓటర్లతో, అధికారులతో మాట్లాడరాదన్నారు. పోలీసులపై ఎవరైనా దాడులు చేస్తే సంబంధిత పీఓలతో వీడియోలు తీయించి పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. మద్యం తాగి పోలింగ్ వస్తే అనుమతి ఇవ్వరాదన్నారు. పోలింగ్ 100 మీటర్ల పరిధిలో పటిష్ట బందోబస్తు చర్యలు ఉంటుందన్నారు. పోలింగ్ వద్ద ఏదేని సమాచారం ఇవ్వకుంటే స్పెషల్ సైకింగ్ అధికారులకు సమాచారం ఇస్తే 5నిమిషాల్లో ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుతారన్నారు.


logo