శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 21, 2020 , 01:19:51

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండినల్లగొండ, నమస్తేతెలంగాణ: ఈ నెల 22వ తేదీన జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి కోరారు. ఆయన సోమవారం ఎన్నికల పరిశీలకులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌లతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో బైక్‌ ర్యాలీ అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో ఉన్న 48 వార్డుల్లోను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తేనే అన్నివార్డులు సమానమైన పద్ధతిలో అభివృద్ధి చెందనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకులు రవీందర్‌రావులు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు వేయించాలన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీకి రూ.150 కోట్ల కేటాయింపు జరిగిందని, సీఎం కేసీఆర్‌ సహకారంతో మున్సిపాలిటీని సుందరీకరించనున్నట్లు తెలిపారు.

గులాబీమయమైన నీలగిరి...

నల్లగొండలో పట్టణంలోని 48వార్డుల్లోను ఒక్కో వార్డు నుంచి 150 బైక్‌ల చొప్పున సుమారు 7వేల బైక్‌లకు పైగా ఇద్దరు చొప్పున పాల్గొన్నారు. తొలుత హైదరాబాద్‌రోడ్డులోని లక్ష్మీగార్డెన్‌ వద్ద ఈ ర్యాలీని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని నినాదాలు చేశారు. నేతలు కంచర్ల కృష్ణారెడ్డి,  సుంకరి మల్లేష్‌గౌడ్‌, చిలుకల గోవర్ధన్‌, సింగం రాంమోహన్‌ పాల్గొన్నారు.logo