గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 21, 2020 , 01:14:15

నందికొండను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తాం

నందికొండను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తాం


నందికొండ : కాంగ్రెస్‌ పాలనలో గ్రామపంచాయతీ కూడా చేయని నాగార్జునసాగర్‌ను నందికొండ మున్సిపాలిటీగా చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీ అని, నందికొండను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.  సోమవారం నందికొండ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఎన్నికల ఇన్‌చార్జి ఎలిమినేటి సందీప్‌రెడ్డిలతో కలిసి నందికొండ మున్సిపాలిటీలోని 12వార్డుల్లో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో లేని కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే పనులు ఎలా చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆరే నాగార్జునసాగర్‌ను నందికొండ మున్సిపాలిటీగా చేశారని, ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినవిధంగా పనులు చేసేపార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. 60ఏండ్లుగా ఎటువంటి అభివృద్ధి చేపట్టని కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కులేదన్నారు. నందికొండను మున్సిపాలిటీ చేసినప్పటి నుంచి పత్యేక నిధులు కేటాయిస్తూ నూతనంగా రోడ్లు, 18కోట్లలతో దవాఖాన, సబ్‌స్టేషన్‌, కాలనీల పరిశుభ్రత పనులను చేశామని, అంతర్జాతీయస్థాయిలో బుద్ధవనం, లాంచీస్టేషన్‌ నిర్మాణపనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ రాంచందర్‌నాయక్‌, జిల్లా వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, పెద్దవూర జడ్పీటీసీ కృష్ణారెడ్డి, సంపత్‌, గుంటక వెంకటరెడ్డి, కర్ణ బ్రహ్మానందరెడ్డి, బషీర్‌, మర్ల చంద్రారెడ్డి, ఇర్ల రామకృష్ణ, బత్తుల సత్యనారాయణ, బోయ నరేందర్‌రెడ్డి, మంగ్తా, కళావతి, నాగశిరీష, మందరఘువీర్‌, రమేష్‌జీ, నాగరాణి, నిమ్మల ఇందిరా, నకేరకంటి రమణ, బండారు హనుమంతురావు, శ్వేతరెడ్డి, అనుషశరత్‌రెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జ్‌లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ను గెలిపించండి : పల్లా

హాలియా, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి అభివృద్ధి జరగాలన్నా, మంచి ఉన్నత పౌర సేవలు అందుబాటులోకి రావాలంటే, ప్రజల సమస్యలను పరిష్కారం కావాలన్నా మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం హాలియా, నందికొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌లు చిన్నపట్టణాల్లో అభివృద్ధి చేసేందుకుగాను మున్సిపాలిటీలుగా మార్చారన్నారు. గత 2014, 2018లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మానిఫెస్టోలో చెప్పిన అంశాలన్నింటిని పూర్తిచేసిందన్నారు.సమావేశంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఇరిగి పెద్దులు, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్ధి మలిగిరెడ్డి లింగారెడ్డి, నిడమనూరు మార్కెట్‌ చైర్మన్‌ కామర్ల జానయ్య, ఎమ్మెల్యే తనయుడు నోముల భగత్‌యాదవ్‌, పార్టీ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, చేకూరి హన్మంతరావు, యడవెల్లి మహేందర్‌రెడ్డి, నాయకులు వర్ర వెంకట్‌రెడ్డి, ఆవుల పురుషోత్తం, ఆవుల సైదులు, పిల్లి అభినయ్‌యాదవ్‌, ధూలిపాల రామచంద్రయ్య, పామోజు వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>