బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 20, 2020 , 02:08:44

మిషన్‌ భగీరథ నిర్వహణ అభినందనీయం

 మిషన్‌ భగీరథ నిర్వహణ అభినందనీయం


మర్రిగూడ : మిషన్‌ భగీరథ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందించడం అభినందనీయమని సెంట్రల్‌ టాస్క్‌ఫోర్స్‌ ప్రతినిధుల బృందం సభ్యులు అన్నారు. ఆదివారం మండలంలోని కొండూరు, రాజపేటతండాలలో భగీరథ నల్లాలు, ట్యాంకులను పరిశీలించారు. నీటి సరఫరా, నాణ్యతలకు సంబంధించిన పలు అంశాలపై స్థానిక ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ  2020-24 సంవత్సరానికల్లా దేశమంతటా ప్రతి ఇంటికీ నీటిని అందించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పథకాన్ని అమలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం బృందం సభ్యులు నాంపల్లిలో మిషన్‌భగీరథను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహనరెడ్డి, సెంట్రల్‌ కమిటీ ప్రతినిధులు అవినాశ్‌, జయప్రకాశ్‌, ఆర్‌కే శర్మ, ప్రకాశ్‌, సర్పంచ్‌లు కుంభం నర్సమ్మమాధవరెడ్డి, సక్కుబాయి బిచ్చునాయక్‌, ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌ కంచుకట్ల సుభాశ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ నరేశ్‌, ఏఈలు వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.logo