గురువారం 09 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 19, 2020 , 00:33:51

మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం..

 మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం..


రామగిరి : మున్సిపాల్టీల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని, ఇప్పటికే పోలింగ్‌ స్టేషన్‌వారిగా పలు పర్యాయాలు పరిశీలనలు సైతం పూర్తి చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ వెల్లడించారు.  జిల్లాలో ఈనెల 22న నిర్వహించే ఎన్నికల నిర్వహణపై శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల  పరిశీలకురాలు ఐఏఎస్‌ లక్ష్మీ, ఎస్పీ ఏవీ రంగనాథ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడి వివరాలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఏడు మున్సిపాల్టీల పరిధిలో 2,82,379 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఆయా మున్సిపాల్టీల్లో 162వార్డులకు 456 పోలింగ్‌ స్టేషన్స్‌( బూతులు) ఏర్పాటు చేశామన్నారు. కాగా 82 సమస్యత్మాక పోలింగ్‌ప్రాంతాలను గుర్తించామని ఆయా ప్రాంతాల్లో 54వెబ్‌ కెమోరాలు, సూక్ష్మపరిశీలకులు, వెబ్‌కాస్టింగ్‌తోపాటు ప్రత్యేకశ్రద్ధ ఉంటుందన్నారు. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ ప్రింటింగ్‌ పూర్తిచేసి ఆ బ్యాలెట్‌ను సమీపంలోని పోలీస్‌స్టేషన్లు, డీటీఓలల్లో భద్రతతో ఉంచామన్నారు.

ఎన్నికల విధుల్లో వివిధ హోదాల్లో 2,677మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని వీరికి నిర్వహణ తీరుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. నిర్ణయించిన విధంగా ఈనెల 21న ఎన్నిక సామగ్రిని సిబ్బందికి(పీఓ, ఏపీఓ, ఓపీఓ) అందచేసి మధ్యాహ్నంలోగా ఆయా పోలిం గ్‌ బూతులకు చేర్చుతామన్నారు. 22న ఉదయం 7గంటల నుంచి సా యంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని ఓటర్లంతా ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని, ఖర్చుల వివరాలను తెలియచేయాల్సి ఉంటుందన్నారు. ఈనెల 25న కౌటింగ్‌ ఉంటుందని  కౌటింగ్‌ ప్రక్రియ పూర్తికాగానే ఫలితాలు వెల్లడిస్తామన్నారు. అన్ని మున్సిపాల్టిల్లో కౌంటింగ్‌ కేం ద్రాలను గుర్తించామని పోలింగ్‌ పూర్తికాగానే బ్యాలెట్‌ బాక్స్‌లను కౌటింగ్‌కేంద్రాలకు చేర్చుతామన్నారు. మూ డు రౌండ్స్‌ల్లో  కౌటింగ్‌ ప్రక్రియ సాగుతుందని దాదాపుగా మధ్యాహ్నంలోగా ఫలితాలు వెల్లడించేలా చూస్తామన్నారు. జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ మాట్లాడుతూ అన్ని పోలింగ్‌స్టేషన్‌ వద్ద పటిష్ట భద్రత ఉంటుందని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘ ఉంచామన్నారు. 47మొబైల్‌ రూట్స్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. 

అంతేకాకుండా ప్రత్యేక చెక్‌పోస్టులున్నాయని, వీటితోపాటు పెట్రోలింగ్‌, పికెట్స్‌, అదేవిధంగా ప్రత్యేక పోలీసు బలగాలు అందుబాటులో ఉంటయాన్నారు. జిల్లాలోని 1748పోలీసులలోపాటు సమీపం జిల్లాలను మరో 600మంది ఎన్నికల విధులకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విషయంలో 161 వెపన్స్‌ డిపాజిట్‌ చేయించామని, 107బైవండర్‌ కేసులు నమోదుకాగా 444మందిని బైవండర్‌ చేయడంతోపాటు 34మందిపై నాన్‌బైలబుల్‌ కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందే 7మున్సిపాల్టి పరిధిలోని వైన్స్‌షాపులు బంద్‌ చేయిస్తున్నామన్నారు. ఈనెల 21నుంచి ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ప్రత్యేక నిఘా ఉంచి డబ్బు, మద్యం అక్రమ పంపిణీపై దృష్టి ఉం చి స్కాడ్క్‌ బృందాలతో తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు సంతోష్‌,  డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.logo