గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 18, 2020 , 03:38:46

సాంకేతిక పరిజ్ఞానం పట్ల శ్రద్ధ వహించాలి

సాంకేతిక పరిజ్ఞానం పట్ల శ్రద్ధ వహించాలి


నల్లగొండ సిటీ : తెలంగాణ పోలీస్‌ శాఖ అన్ని విభాగాలు, అన్నిస్థాయిల్లో ఆధునిక మార్పులతో ముందుకు సాగుతుందని సాంకేతిక పరిజ్ఞానం అన్ని స్థాయిలలో వినియోగించుకుంటుందని అందుకు అనుగుణంగా శిక్షణలో అన్ని అంశాలు నేర్చుకోవాలని ఎస్పీ రంగనాథ్‌ అన్నారు. శుక్రవారం పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ఎంపికైన ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన 164మంది అభ్యర్థులకు 9 నెలల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణకు వచ్చి న అభ్యర్థులు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉన్నవారికి మంచి భవిష్యత్‌ ఉంటుందని, అందువల్ల తెలంగాణ పోలీస్‌ శాఖ వినియోగిస్తున్న మొబైల్‌ అప్లికేషన్లపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. పోలీస్‌ ఉ ద్యోగం ఉత్తమమైందని, ప్రజలకు సన్నిహితంగా ఉంటూ సేవ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇండోర్‌ శిక్షణ, అవుట్‌డోర్‌ శిక్షణలో నేర్పే అంశాలను నేర్చుకోవాలన్నారు.

భారతశిక్షా స్మృతి సెక్షన్లు, మానవ హక్కుల గురించి శిక్షణలో నేర్పుతామన్నారు. చట్టాలను తెలుసుకుంటూ దాని పరిధిలో పని చేయాలన్నారు. ఈ ఉద్యోగంలో క్రమశిక్షణ అవసరమని గుర్తుంచుకోవాలన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని పోలీస్‌ అభ్యర్థి బాధ్యతాయుతంగా శిక్షణలో పాల్గొనాలన్నారు. వాతావరణం పరిస్థితులు తట్టుకునేలా తయారైతే 9నెలల శిక్షణ పూర్తి చేస్తారన్నారు. స్మార్టుఫోన్లు శిక్షణ తరగతుల్లోకి అనుమతి ఉండదన్నారు. కష్టపడితే మెరుగైన జీవితం ఉంటుందని, ఇంగ్లీష్‌ భాషపై పట్టు సాధించాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో డీటీసీ ఏఎస్‌సీ సతీశ్‌ చోడగిరి, ట్రెయినీ ఐపీఎస్‌ వైభవ్‌, డీటీసీ డీఎస్పీ ప్రతాపరెడ్డి, వన్‌టౌన్‌ సీఐ సురేశ్‌, ఆర్‌ఐలు భరత్‌ భూషన్‌ప్రతాప్‌, నర్సింహాచారి, ఆర్‌ఎస్‌ఐలు శ్రీనివాస్‌, యూసుపుద్దీన్‌ పాల్గొన్నారు.logo
>>>>>>