గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 17, 2020 , 00:57:38

టీఆర్ మైనార్టీల అభివృద్ధి

టీఆర్ మైనార్టీల అభివృద్ధి


మిర్యాలగూడ టౌన్ : టీఆర్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారానే ముస్లిం మైనార్టీల అభివృద్ధి జరుగుతుందని స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎంఎన్ ఫంక్షన్ నిర్వహించిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ముస్లిం యువతులకు షాదీముభారక్, రంజాన్ తోఫాలు అందించడంతోపాటు మైనార్టీ గురుకులాలు, కార్పొరేషన్ రుణాలు అందిస్తుందన్నారు. ఈనెల 22న జరిగే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు టీఆర్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో ముస్లింల సంక్షేమం కోసం అవంతీపురంలో ఏడెకరాల స్థలంలో ఈద్గా, కోటి రూపాయల నిధి, రూ.20లక్షలతో వజూఖాన నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. 8 మంది ముస్లింలకు కౌన్సిలర్ టికెట్లిచ్చామని, సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులు గుర్తించి అందరినీ గెలిపించాలని కోరారు. కారు గుర్తుకు ఓటేయడం ద్వారానే మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ పట్టణాధ్యక్షుడు తిరునగరు భార్గవ్, ఎండీ మగ్దూంపాష, మహ్మద్ ఇలియాస్, ఖాందర్, చాంద్ జావీద్, అబ్దుల్ సలీం, మదార్ రాష్ట్ర నాయకుడు ఎండీ ఫహీమొద్దిన్, సత్తార్ షెహనాజ్ పాల్గొన్నారు.logo
>>>>>>