గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 17, 2020 , 00:56:53

అన్నా.. జర కనిపెట్టాల్నే..

అన్నా.. జర కనిపెట్టాల్నే..


తిరుమలగిరి, నమస్తేతెలంగాణ : అన్నా గీ మున్సిపాలిటీలో నామినేషన్ వేశా.. జర గీ సారి కనిపెట్టాల్నే.. మనోళ్లకు చెప్పి మనకే ఓటు పడేలా సూడే ఖర్చుకు వెనక్కిపోఏది లేదు. అంతే కాదు మంచిగా దావత్ ఇస్తా.. ఎంత ఖర్చయినా భరాయిస్తా గాని గెలిసేటట్టు జేయాల్నే అని కౌన్సిలర్ నామినేషన్ వేసిన వ్యక్తి గంటయ్య, ఓటరు పెంటయ్య మధ్య ఫోన్ సంభాషణ..
గంటయ్య : హలో పెంటయ్య... నేను గంటయ్యని మాట్లాడుతున్నా యాడున్నవ్ ?
పెంటయ్య : గీ బర్లను బాయికాడికి తొలుక పోతున్న.. ఎమో తెల్లారంగానే  ఫోన్ గొడ్తివి?
గంటయ్య : ఆ.. ఏంలేదు పెంటయ్య.. నీతో జర పనిపడ్డదే ఇంటికి ఎప్పుడు వస్తవో సెప్పు. సెల్లే నీ ఫోన్ నెంబర్ ఇస్తే మీ ఇంటి గాడినుండే ఫోన్ చేస్తున్నా.

పెంటయ్య : ఏందే .. ఎన్నడు లేనిది గియ్యాల పొద్దుగాల ఇంటికిపొయి పనిపడ్డది  అంటున్నావ్. అంత ఆపద ఏమోచ్చిందే..?
గంటయ్య : అరే ఆపద కాదే నీతో సాన అవసరం వచ్చిందే .. నీ గల్లీల  వున్నోళ్లందరికీ గూడ నువ్వే జర సముజాయించాలే జర. ఇయాల్ల పొద్దుగాల నువ్వు ఇంటికొస్తే ముందుగాల నీతో మాట్లాడుతా?
పెంటయ్య : ఇంటి కొచ్చి ఏందన్నా.. ఎన్నడులేన్ది  ఇంటికి వచ్చినవ్.. జర అర్ధమయ్యేట్లు సెప్పు.
గంటయ్య : అరె.. నీకు సెప్పకుంటే ఎవరికి సెప్తనే..మున్సిపాలిటీ ఎలచ్చన్లు జరుగుతున్నయ్ గీ తాప నేను పోటీ సేస్తున్న.. జర దయ సూపి మీరంతా నాకు ఓట్లేసి కౌన్సిలర్ గెలిపియ్యాలే..ఆ తర్వాత డబ్బులు పెట్టి నా దమ్ము సూపించుకుంటా. ఇక సైర్మన్ అయిపోతా.
పెంటయ్య : హమ్మనీ దుంపదెగ.. అసలు కథ గిదా.. నాకు గప్పుడే అనుమానం గొట్టింది. యాడాదికొక్కసారి  సైతం పలకరించని  గంటయ్య  పొద్దుగాల ఫోన్ సేసిండు ఏంది అనుకున్నా..!
గంటయ్య : గట్లనకు పెంటయ్య నాకు మీరుగాకుంటే ఇంకెవరున్నారే. గిన్ని రోజులు దందాల పడి తినడానికి సైతం తీరికలేక పాయే. అందుకే వీలుగాలేదు. ఇగ గిప్పటి సంచి ఎప్పుడు మీ యెంటే ఉండటానికి పోటీ సేస్తున్న .

పెంటయ్య : గంటయ్య నువ్వు గింత అడుగుతుంటే గాదంటానా.. ఇంటికానే కూసో.. గల్లోళ్లు ఎవరున్నారో పిలిసుకోస్తా అని వెళ్లి ..అందరితో కలిసి.. పిల్లికి బిచ్చం ఎయ్యని గీ గంటయ్య డబ్బులతో దమ్ము సూపెడుతాడంటా? మన దమ్ము ఎంత ఉందో ఓటు గుద్ది సూపెడుదాం. ఈసారి గూడా.. గా..గులాబీ చంద్రయ్యకే ఓటు ఏద్దాం మనకు ఎంతో అభివృద్ధి జేసిండు అని తీర్మానించుకుంటారు. అందదూ కలిసి సరే గంటయ్య వెళ్లిరా అని .. ఆమాస..పున్నానికి.. వచ్చే టోళ్లలకు మనసంగతేందో.. సూపెట్టాలే అని మదిలో అనుకుంటారు.


logo