సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 15, 2020 , 03:45:32

అభ్యర్థులు ఖరారు

 అభ్యర్థులు ఖరారు
  • - నామినేషన్ల ఉపసంహరణ పూర్తి, బీ-ఫారం దాఖలు
  • - జిల్లాలో మొత్తం 161 వార్డులకు 714మంది అభ్యర్థులు
  • - చిట్యాల మున్సిపాలిటీలో 3వ వార్డు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం
  • - రంగంలోకి ముఖ్య నేతలు.. ఇంకా ఆరు రోజులే సమయం
  • - మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నేటి నుంచి మరింత ముమ్మరం

మున్సిపాలిటీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ
ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌
సహా అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. స్వతంత్ర అభ్య
ర్థులు సైతం భారీగానే బరిలోకి దిగారు. జిల్లాలో మొత్తం 162వా
ర్డులు ఉండగా.. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు నుంచి
ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నేత కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి ఏకగ్రీవమైన
సంగతి తెలిసిందే. మిగిలిన 161వార్డులకు 713మంది పోటీలో
ఉన్నారు. నేడు పండుగ మినహాయిస్తే ప్రచారానికి ఐదు రోజుల
సమయం మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి అభ్యర్థులు
తమ ప్రచారం మరింత ఉధృతం చేయనున్నారు. ఆయా పార్టీల
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు ప్రచార రంగంలోకి
దిగనున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు విస్తృతంగా
ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులంతా ఖరారయ్యారు. తీవ్ర పోటీతో కొందరు.. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మరికొందరు.. చివరి నిమిషం వరకూ అభ్యర్థులను తేల్చకుండా పెండింగ్‌లో పెట్టి.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే ముందు ఖరారు చేశారు. మంగళవారంతో నామినేషన్ల గడువు పూర్తి కాగా.. జిల్లాలో మొత్తం ఏడు మున్సిపాలిటీల పరిధిలోని 161వార్డులకు 713మంది పోటీలో ఉన్నారు. మొత్తం 162వార్డులు ఉన్నా.. చిట్యాలలో 3వ వార్డు ఇప్పటికే ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడం మొదలు ప్రచారంలోనూ మిగిలిన పార్టీల కంటే ముందుంది. ఏకగ్రీవమైన ఏకైక వార్డు సైతం టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే చేరింది.
నల్లగొండలో అత్యధికం..     చండూరులో అత్యల్పం...

మొత్తం జిల్లాలోని 161వార్డు స్థానాలకు ఈ నెల 22న పోలింగ్‌ జరుగనుంది. జిల్లా కేంద్రం నల్లగొండలో 48వార్డులకు 225మంది బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ నుంచి 48, కాంగ్రెస్‌ 46, బీజేపీ 45, సీపీఎం 5, ఎంఐఎం 9, టీడీపీ 7, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి నలుగురు పోటీలో ఉండగా.. స్వతంత్రులు 61మంది కౌన్సిలర్‌ సభ్యత్వాల కోసం పోటీ పడుతున్నారు. మిర్యాలగూడలో మొత్తం 48వార్డులకు 178మంది పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి 48, కాంగ్రెస్‌ 43, బీజేపీ 24, ఏఐ ఎంఐఎం 2, సీపీఎం 5, స్వతంత్రులు 47, టీడీపీ 9   బరిలో నిలిచారు. నందికొండలో 12వార్డులకు 77మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. టీఆర్‌ఎస్‌ 12, కాంగ్రెస్‌ 12, బీజేపీ 11, టీడీపీ 7, సీపీఐ 2, ఇండిపెండెంట్లు 33 మంది ఉన్నారు. హాలియాలో 12 వార్డులకు.. టీఆర్‌ఎస్‌ 12, కాంగ్రెస్‌ 12, బీజేపీ 10, టీడీపీ 2, సీపీఎం 2, ఇండిపెండెంట్లు 22 మంది.. మొత్తం 60మంది బరిలో నిలిచారు. దేవరకొండలో 20వార్డులకు 83మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. టీఆర్‌ఎస్‌ 20, కాంగ్రెస్‌ 19, బీజేపీ 20, సీపీఐ 3, సీపీఎం 1, ఇండిపెండెంట్లు 20మంది ఉన్నారు. చండూరులో 10వార్డులకు 44మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌10, కాంగ్రెస్‌ 10, బీజేపీ 10, సీపీఎం 2, ఇండిపెండెంట్లు 12మంది పోటీ చేస్తున్నారు. చిట్యాలలో 11వార్డులకు 47మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. టీఆర్‌ఎస్‌ 11, కాంగ్రెస్‌ 6, సీపీఎం 5, టీడీపీ 5, బీజేపీ 6, నేషనల్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌ 4, టీజేఎస్‌ 1, స్వతంత్రులు 9మంది అభ్యర్థులున్నారు.logo