సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 15, 2020 , 03:39:07

తెలంగాణలో దేవాలయాలకు పూర్వవైభవం

తెలంగాణలో దేవాలయాలకు పూర్వవైభవం
  • - మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

నకిరేకల్‌, నమస్తేతెలంగాణ : కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నకిరేకల్‌ మండలం పాలెం గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ దేవస్థానంలో గోదాదేవి కల్యాణ మహోత్సవంలో ఆయన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పాలెంలోని శ్రీలక్ష్మినరసింహ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ ఆలయంతో గడిచిన 20సంవత్సరాలుగా తనకు అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఆలయ పునరుద్దరణ కోసం అహర్నిశలు కృషిచేసిన వారిని అభినందించారు. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ ప్రతిఒక్కరు దైవభక్తితో మెలగాలని దైవభక్తితో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని, ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు దూదిమెట్ల బాలరాజుయాదవ్‌, ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్‌రావు, జడ్పీటీసీ మాద ధనలక్ష్మినగేష్‌గౌడ్‌, సర్పంచ్‌ ఏకుల కవితవిజయ్‌కుమార్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ఖాసీంఖాన్‌ నాయకులు చింతల సోమన్న, నడికుడి వెంకటేశ్వర్లు, సకినాల రవి, ప్రగడపు నవీన్‌రావు, వీర్లపాటి రమేష్‌, నోముల గోవిందరాజులు, రాచకొండ వెంకన్నగౌడ్‌, యల్లపురెడ్డి సైదిరెడ్డి, గోరల వీరయ్యయాదవ్‌, నోముల కేశవరాజు, మల్లారెడ్డి పాల్గొన్నారు.logo