శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 15, 2020 , 03:36:29

కౌన్సిలర్‌గా కాదు... సేవకుడిగా పనిచేస్తా

కౌన్సిలర్‌గా కాదు... సేవకుడిగా పనిచేస్తా
  • - మీలో ఒకడినై సేవకుడిగా ఉంటా.. ఒక ఛాన్సివ్వండి నేనేంటో నిరూపిస్తా
  • - ఇంటింటి ప్రచారంలో 36వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింగిరికొండ శివశంకర్‌

నీలగిరి: ఆదరించి కౌన్సిలర్‌గా గెలిపిస్తే నాయకుడిగా కాకుండా సేవకుడిగా మీలో ఒకడిగా ఉండి పని చేస్తానని 36వ వార్డు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థి సింగిరికొండ శివశంకర్‌ అన్నారు. మంగళవారం వార్డు పరిధిలోని యాటకన్నారెడ్డి కాలనీ, వివేకానందనగర్‌, న్యూ రాఘవేంద్రకాలనీల ప్రాంతంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆయన కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటా తిరుగుతూ కారుగుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి ఆయనకు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు గుర్తుపై ఓటేసి ఒక ఛాన్సిచ్చి కౌన్సిలర్‌గా తనను గెలిపిస్తే వార్డును అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి నేనేంటో నిరూపించుకుంటానని అన్నారు. అందరిలాగా కాంట్రాక్టుల కోసం పాకులాడను. ఏ పైరవీలు చేయను.  మీలో ఒకడినై సేవకుడిగా ఉంటానని విజ్ఞప్తి చేశారు. ఈ వార్డుల్లో మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కంచర్ల భుపాల్‌రెడ్డి  సహకారంతో పూర్తి చేయిస్తానని అన్నారు. వార్డులో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, పలు కాలనీల్లో సీసీరోడ్లు, వీధిలైట్లు, పారిశుధ్య పనులతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ముందుండి పని చేస్తానన్నారు. వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. నాయకుడిగా, కౌన్సిలర్‌ అని గర్వపడకుండా కుటుంబంలో సభ్యుడిగా, సేవకుడిగా నిస్వార్థంతో నిజాయితీ, నిషక్షపాతంగా పని చేస్తానన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కంచర్ల భుపాల్‌రెడ్డి సహకారంతో ఎస్‌డీఎఫ్‌ నిధుల నుంచి సీసీరోడ్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించామన్నారు. లతీఫ్‌సాబ్‌ గుట్టపై నుంచి వచ్చే వరద నీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ద్వారా రూ.5.50కోట్లతో కాల్వ పనులు మంజూరు చేసి వరద సమస్య పరిష్కారం చేశామన్నారు.  ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కేశబోయిన శంకర్‌, కర్నాటి వేణు, లెంకల మల్లారెడ్డి, మార్త యాదగిరిరెడ్డి, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, కొండాపురం అరుణ్‌, సిరిగిరి రామనుజమ్మ, సింగిరికొండ రజినీ, పాలకూరి నవనీత, పాలకురి నర్సింహ, గడ్డం జాన్‌రెడ్డి, ఎస్‌.యాదగిరి, తుపాకుల ప్రవీణ్‌ తదితరలు ఉన్నారు.logo