ఆదివారం 29 మార్చి 2020
Nalgonda - Jan 14, 2020 , 01:11:24

యాద్రాద్రిలో ఘనంగా పూజలు

యాద్రాద్రిలో ఘనంగా పూజలు


యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ : యాదాద్రికొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామివారికి సోమవారం రుద్రాభిషేకం నిర్వహించారు. విశేషసంఖ్యలో భక్త జనులు పరవశంతో పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో రామలింగేశ్వరుడి ప్రత్యేకపూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ప్రభాతవేళలో మొదటగా గంటన్నరపాటు శివుడ్నికొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలలో అభిషేకం చేశారు. పంచామృతాలలో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడ్ని విభూతితో ఆలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చన చేశారు. ప్రభాతవేళ జరిగే రుద్రాభిషేకంలో పాల్గొని శివుడిని ఆరాధించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శుభం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. శివాలయం ఉప ప్రధాన పురోహితులు గౌరీబట్ల నర్సింహ రాములు శర్మ ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. శ్రీ లక్ష్మీనరసింహుని బాలాలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం, నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

శ్రీవారి ఖాజానాకు రూ.9,43,383 ఆదాయం

శ్రీవారి ఖజానాకు రూ. 9,43,383 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 1,01,796, కల్యాణకట్ట ద్వారా రూ. 24,000 వత్రపూజల ద్వారా రూ.43,500, ప్రసాద విక్రయాలతో రూ.4,52,325, శాశ్వత పూజల ద్వారా రూ.6,000, తులసీ కాటేజీతో రూ. 56,080, టోల్‌గేట్‌ ద్వారా రూ. 1,320, అన్నప్రసాదంతో రూ. 14,065, వాహనపూజలతో రూ. 19,500,  ఇతర విభాగాలతో రూ. 1,27,447తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 9,43,383 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.logo