గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 14, 2020 , 01:10:32

నేడు భోగి, రేపు సంక్రాంతి

 నేడు భోగి, రేపు సంక్రాంతి


నల్లగొండ కల్చరల్‌ : ప్రజలు నేడు భోగి పండుగ సందర్భంగా భోగభాగ్యాలు కలగాలని నేడు తెల్లవారుజాము నుంచే భోగి మంటలు పెట్టనున్నారు. ఇంట్లో ఉన్న పాత వస్తువులు(కాలేవి) మంటలో వేసి కాలుస్తారు. దీంతోపాటు మహిళలు, యువతులు, చిన్నారులు ఆవుపేడతో కాళ్లపీ జల్లి రంగురంగుల్ల రంగవల్లు ఇండ్ల ముంగిట్లో పరుస్తుంటారు. వాటిలో ఆవుపేడతో చేసిన గొబ్బమ్మలు పెట్టి వాటిలో గరిక, పిండిగొమ్మలు(ఉత్తరరేణి), తంగేడు కొమ్మలను పెట్టి వాటికి పసుపు, కుంకుమ బొట్టు పెట్టి ముగ్గు మధ్యలో ఉంచి వాటి చుట్టు రేగి పండ్లు, బంతిపూలు జల్లుతారు. కొన్ని ప్రాంతాల్లో సజ్జలు, జొన్నలు, బియ్యం పిండిని కూడా జల్లుతారు. భోగి నాడు చిన్నపిల్లలకు(3సంవత్సరాల లోపు) గ్రహపీడలు, శని తొలిగి సకల ఐశ్వర్యలతో ఉండాలని రేగిపండ్లను భోగి పండ్లుగా పోడయంతోపాటు గొబ్బిళ్ల చుట్టూ ధాన్యాలు పోసి పశుపక్షాదులకు ఆహారంగా ఉంచుతారు.

సంక్రాంతి ప్రత్యేకతలు..

ఈనెల 15న సూర్యుడు మకర రాశిలోకి మారడంతో మకర సంక్రాంతిగా పేరు వచ్చింది. రైతులు పండించిన పంటలు చేతికొస్తాయి. ఈకాలంలో బంతి, చేమంతిపూలు, రేగిపండ్లు, మిరపపళ్లు తదితరమైనవి పుష్కలంగా దొరుకుతాయి. సంక్రాంతిరోజున కొత్త బియ్యంతో బెల్లం, నువ్వులు వేసి ‘పులగం’ చేసి కుటుంబసభ్యులతోపాటు సమీప బంధువులు, స్నేహితులకు సంతోషంతో ఉండాలని పంచుతారు. మరో వైపు రైతులు పంటలు చేకి రావడంతో పశు, పక్షాదులకు ధాన్యలను ఆహారంగా అందిస్తారు. తరువాత కనుమ పండుగాను పశువుల పండుగా భావిస్తు కొమ్ములకు రంగులు పెట్టి అలంకరించి ముఖంపై బొట్టు పెట్టి జంగమదేవరలు శంభోశంకర అంటూ గంటలు మోగించి సంబరాలు జరుపుతారు. బియ్యం పిండితో చేసే అరిసెల్లో దేహపుష్టిని పెంచే లక్షణం అధికంగా ఉంటుంది. రుచిగా ఉండంతోపాటు అతిరసమయిగా ఉంటాయి. బెల్లంపానకంతో చేసిన అరిసెలు ఎంతో రుచిగా ఉంటాయి.

ఇక అన్నిశుభాలే..

సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో సంక్రాంతి వస్తుంది. ఈ సంవత్సరం జనవరి 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగలు చేసుకోవాలి. దీనికి కారణం 14న సూర్యభగవానుడు ఉత్తరాషాడ నక్షత్ర ద్వితీయ పాదమైన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నందున ఉత్తరాయణంలోనే భోగి 14న చేసి, 15న సంక్రాంతి జరుపుకోవాలి.
- దౌలతాబాద్‌ వాసుదేవశర్మ, ధూప నైవేద్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


logo