మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Jan 13, 2020 , 02:22:34

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
  • - గ్రామంలో పచ్చదనం వెల్లివిరియాలి
  • - గ్రామసభలో చెత్త బుట్టలను పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి

నార్కట్‌పల్లి : పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మండలంలోని ప్రతీ గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని శేరుబాయిగూడెం, దాసరిగూడెం గ్రామాల్లో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామసభ లో పాల్గొని మొక్కలు నాటారు. అదేవిధంగా తడిపొడి చెత్త సేకరించే బుట్టలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో క్షేత్రస్థాయిలోని సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు పల్లెప్రగతి కార్యక్రమం ఒక వేదికగా నిలిచిందని అన్నారు. రెండో విడుత పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డులు, నర్స రీ, ఇంకుడుగుంతల నిర్మాణ పనులు వందశాతం పూర్తి కా వాలని అన్నారు. మల్లీ ఏప్రిల్‌లో జరిగే మరో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం నాటికి ఎక్కడా పనులు పెండింగ్‌లో ఉండడానికి వీలులేదని సంబంధిత  అధికారులకు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలకు బాధ్యలౌతారని హెచ్చరించారు. నర్సరీల పట్ల ప్రతీరోజు పర్యవేక్షణ చేసి మొక్కలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనని అన్నారు. దీంతోపాటు ప్రతీ ఇంట్లో ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కల్లూరి యాదగిరి, సర్పంచ్‌ అలుగుబెల్లిఇందిరా సత్తిరెడ్డి, అనంతరెడ్డి పాల్గొన్నారు. 

గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం

- డీఆర్డీఏ పీడీ శేఖర్‌రెడ్డి
దామరచర్ల : గ్రామస్తులు సహకరిస్తేనే పల్లెల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని డీఆర్డీఏ పీడీ శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని తాళ్లవీరప్పగూడెం, రాజగట్టు, గణేశ్‌పాడు గ్రా మాల్లో ఆదివారం పల్లె ప్రగతి రెండో విడుత పనులు పరిశీలించారు. రాజగట్టులో గ్రామసభలో పాల్గొన్నారు. అనంతరం అభివృద్ధి పనులు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశా రు. అనంతరం గణేశ్‌పాడులో చేపట్టిన పనులు పరిశీలించి పల్లెప్రగతి పనులు పరిశీలించి సబ్సిడీపై వచ్చిన ట్రాక్టర్‌ను పంపిణీ చేశారు. తాళ్లవీరప్పగూడెంలో ఏర్పాటు చేసిన గ్రా మసభలో పాల్గొని గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. గ్రామాల్లో అభివృద్ధి సాధనకు ప్రజల భాగస్వా మ్యం తప్పని సరిగా ఉండాలన్నారు. కేవలం ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆధారపడితే 10 శాతం పనులు పూర్తిచేయలేమన్నారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలు, వర్గాలు వీడి కలిసి ఐకమత్యంగా పనిచేస్తే పల్లెలు సస్యశ్యామలం అవుతాయన్నారు. రెండోవిడుతలో డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటిక, ఇంకుడుగుంతలు, హరితహారం కార్యక్రమాలతో పాటుగా మొదటి విడుత మిగిలిపోయిన పనులు పూర్తిచేయాలన్నా రు. అనంతరం ఆయా గ్రామాల్లో మొక్కలను నాటారు. కా ర్యక్రమంలో ఎంపీపీ రమావత్‌ నందిని, జడ్పీటీసీ ఆంగోలు లలిత, పీఏసీఎస్‌ చైర్మన్‌ డీ నారాయణరెడ్డి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, వైస్‌ఎంపీపీ కే సైదులురెడ్డి, సర్పంచులు బాల సుజాత, గజ్జెల వరలక్ష్మి, ఎంపీటీసీలు ఆర్‌ సైదులు, హాతీ రాం, రవితేజ, కార్యదర్శులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పుట్టలగడ్డతండాలో సర్పంచ్‌ రూపావత్‌ భాష్యానాయక్‌ ఆధ్వర్యంలో చెత్తబుట్టలను పంపిణీ చేశారు. వాచ్యాతండాలో సర్పంచ్‌ లావూరి శ్రీనునాయక్‌ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ నివారణలో భాగంగా గన్నీ బ్యాగులను అందజేశారు.


logo
>>>>>>