శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 13, 2020 , 02:20:53

సాగర్‌లో పర్యాటకుల సందడి

సాగర్‌లో పర్యాటకుల సందడి


నందికొండ : వారాంతపు, పండగ సెలువు దినాలు కావడంతో ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌కు  అధిక సంఖ్యలో పర్యాటకులు, విద్యార్థులు సందర్శించడంతో సాగర్‌లో పర్యాటకులతో సందడి వాతావరణ నెలకొంది. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో నదిమార్గంలో జాలీ ట్రిప్పులకు వెళ్లుటకు పర్యాటకులు, విద్యార్థులు ఉత్సాహం కనపరిచారు. కృష్ణానదిలో చుట్టూ నల్లమల్ల అడువుల అందాల మధ్య లాంచీలో జాలీ ట్రిప్పు ప్రయాణం బాగుందని పర్యాటకులు తెలిపారు. పర్యాటకులు నదితీరంలో సెల్పీలు దిగుతూ సరదాగా గడిపారు. నాగార్జునకొండకు అనుమతి లేకపోవడంతో లాంచీ స్టేషన్‌ నుంచి జాలీ ట్రిప్పులను మాత్రమే ఆదివారం నడిపామని లాంచీస్టేషన్‌ హరిబాబు తెలిపారు. విహారయాత్రలకు వచ్చే విద్యార్థులు, పర్యాటకులతో సాగర్‌ పర్యాటక ప్రాంతాలైన లాంచీ స్టేషన్‌, దయ్యాలగండి, డ్యాం పరిసర ప్రాంతాలు విద్యార్థులు, పర్యాటకులతో కిటకిటలాడాయి. నాగార్జునకొండుకు లాంచీలు తిరగకపోవడంతో పర్యాటకులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. టూరిజం ఉన్నతాధికారులు చొరవ తీసుకొని నాగార్జునకొండ లాంచీలు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.


logo