శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 12, 2020 , 04:56:32

ముగిసిన పరిశీలన

ముగిసిన పరిశీలన

మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలు కాగా.. శనివారం అధికారుల పరిశీలనలో 24సెట్లు తిరస్కరణకు గురయ్యాయి.

  • జిల్లా వ్యాప్తంగా 24నామినేషన్లు తిరస్కరణ
  • అత్యధికంగా నల్లగొండలో15.. హాలియాలో నిల్‌
  • 1314మంది అభ్యర్థుల 2019నామినేషన్లు ఆమోదం
  • తిరస్కరణ నామినేషన్లపై నేడు అప్పీల్‌కు అవకాశం

మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలు కాగా.. శనివారం అధికారుల పరిశీలనలో 24సెట్లు తిరస్కరణకు గురయ్యాయి.

 జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో 1314మంది దాఖలు చేసిన 2019నామినేషన్లు ఆమోదం పొందగా తిరస్కరణకు గురైన అభ్యర్థులు నేడు అప్పీల్‌ చేసుకునే 
అవకాశం ఉంది. ఆర్డీఓ కార్యాలయాల్లో అప్పీల్‌ స్వీకరించి తిరస్కరణకు కారణాలను తెలియజేయనున్నారు. అత్యధికంగా నల్లగొండ మున్సిపాలిటీలో 
15నామినేషన్లు తిరస్కరించగా హాలియాలో నామినేషన్లన్నీ ఆమోదం పొందడం విశేషం.


నల్లగొండ, నమస్తే తెలంగాణ : నల్లగొండ, మిర్యాలగూడ, నందికొండ, హాలియా, చండూర్‌, సాగర్‌, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీల్లో 162వార్డులున్నాయి. తిరస్కరణకు గురైన 24నామినేషన్లలో అత్యధికంగా నల్లగొండలో 15, దేవరకొండలో 4, చండూరు2, నందికొండ, చిట్యాల, మిర్యాలగూడ మున్సిపాలిటీలలో ఒకటి తిరస్కరించారు. హాలియాలో 97మంది అభ్యర్థులు దాఖలు చేసిన 155నామినేషన్లు ఆమోదం పొందాయి. నామినేషన్లను తిరస్కరించడానికి కారణాలు కోరుతూ అభ్యర్థులు నేడు అప్పీల్‌ చేసుకోవచ్చు. మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయాల్లో సమాధానం ఇవ్వనున్నారు.


logo