సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 12, 2020 , 03:18:32

శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమిస్తే కఠినచర్యలు : తాసిల్దార్‌ సైదులు

శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమిస్తే కఠినచర్యలు : తాసిల్దార్‌ సైదులుపెద్దవూర : శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పెద్దవూర తాసిల్దార్‌ సైదులు హెచ్చరించారు. మండలంలోని తెప్పలమడుగు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్మశాన వాటికను ఆక్రమించారని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో శనివారం ఆయన గ్రామానికి చేరుకుని శ్మశానవాటిక స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, కంపోస్ట్‌ షెడ్‌లకు ఆయా గ్రామాల్లో స్థలాలను కేటాయించామన్నారు. ఈ ప్రభుత్వ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తరి శ్రీను, నోడల్‌ ఆఫీసర్‌ సైదులు, వీఆర్‌ఓ కృష్ణయ్య, కార్యదర్శి షేక్‌ ఖజా, వీఆర్‌ఏ కవిత, మాజీ సర్పంచ్‌ తరి పెద్దులు, ఉప సర్పంచ్‌ పల్లెబోయిన లక్ష్మమ్మ, వార్డు నెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.


logo