శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 12, 2020 , 03:17:59

ఘనంగా కూడారై ఉత్సవం

ఘనంగా కూడారై ఉత్సవంమిర్యాలగూడ టౌన్‌: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా హౌసింగ్‌బోర్డ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం కూడారై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే వందలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేకపూజలు నిర్వహించి 27వ పాశురం పఠించారు. గోదారంగనాథ స్వామిలకు 1116 గంగాలలో నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ  ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్‌ పశ్య మనోహర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, లింగయ్య, విజయలక్ష్మి, లలితమ్మ తదితరులు ఉన్నారు.

దామరచర్ల : మండలంలోని దామరచర్ల, వీర్లపాలెం గ్రామాల్లోని శ్రీకోదండ రామాలయాల్లో కూడారై మహోత్సవ పూజా కార్యక్రమాలను శనివారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ధనుర్మాస వ్రత పూజా కార్యక్రమంలో భాగంగా 27వ రోజున విశేష పాశురమైన ‘కూడారై వెళ్లుం శిరు కోవిందా’ పారాయణం చేశారు. ఉదయం ఆలయాల్లో సుప్రభాత సేవ, షోడష ఉపచార, అష్టోత్తర శతనామార్చనలు, తిరుప్పావై పూజలను నిర్వహించారు. అనంతర 108గంగాళాల్లో పాయసం ఉంచి స్వామివారికి నివేదించి భక్తులకు అందజేశారు. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నపిల్లలు గోదా వేషాధారణతో భక్తులను ఆకట్టుకున్నారు.


logo