గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 12, 2020 , 03:16:35

ఓటరు నమోదు, అభ్యంతరాలపై ప్రత్యేక శిబిరం

ఓటరు నమోదు, అభ్యంతరాలపై ప్రత్యేక శిబిరందేవరకొండ, నమస్తేతెలంగాణ : ఓటరు నమోదు, అభ్యంతరాలపై శనివారం దేవరకొండ పట్టణంతోపాటు, మండలంలో రెవిన్యూ అధికారులు ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు నూతన ఓటరు నమోదుకు సంబంధించి దరఖాస్తులతోపాటు, అభ్యంతరాలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈమేరకు శనివారం దేవరకొండ ఆర్డీఓ గుగులోతు లింగ్యానాయక్‌ పట్టణంలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు గత డిసెంబర్‌ 16న డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈనెల 15వరకు అన్ని పోలింగ్‌ బూత్‌ల్లో అభ్యంతరాలను స్వీకరించి పరిశీలన అనంతరం ఫిబ్రవరి 7న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామన్నారు. జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించనున్నామని, తేదీ.1.1.2020 నాటికి 18ఏళ్లు నిండిన యువత ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. 12వ తేదీన కూడా కొనసాగుతుందని, బీఎల్‌వోలు అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరిస్తారని ఆర్డీఓ తెలిపారు.


logo
>>>>>>