బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 12, 2020 , 03:15:56

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
  • - ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యచిట్యాల : టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్‌ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం సాయంత్రం చిట్యాలలోని  5, 6వ వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే చిట్యాలలో దాదాపు రూ. 1 కోటికి పైగా నిధులతో అభివృద్ధి చేస్తాన్నారు. అన్ని వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించి మున్సిపాలిటీలో గులాబీ జెండాను ఎగురవేస్తే మరింత అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని అన్నారు. వృత్తిదారులు, వ్యవసాయ కూలీలలతోపాటు కాలనీలలోని పలువురిని కలిసి కారు గుర్తుకు ఓటు వేసి 5వ వార్డు సభ్యులుగా గుండెబోయిన శ్రీలక్ష్మిసైదులు, 6వ వార్డు సభ్యులుగా పందిరి గీతారమేష్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, వేలుపల్లి మధుకుమార్‌ పాల్గొన్నారు.


logo