గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 12, 2020 , 03:14:45

గురుకుల పాఠశాలల్లో మంచి ఫలితాలు

గురుకుల పాఠశాలల్లో మంచి ఫలితాలు
  • -పేరెంట్‌కమిటీ అధ్యక్షుడు నవీన్‌ కుమార్‌నల్లగొండ, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో విద్యార్థుకు నాణ్యమైన విద్య అందుతుందని ఎస్‌ఎల్‌బీసీ గురుకుల పాఠశాల పేరెంట్‌ కమిటీ అధ్యక్షుడు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడిదెల నవీన్‌ కుమార్‌ అన్నారు. శనివారం స్థానిక గురుకుల పాఠశాలలో జరిగిన ఇంపాక్ట్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయని, ఎస్‌ఎల్‌బీసీ పాఠశాలలోనూ మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ప్రిన్సిపాల్‌ వనజ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో అధ్యాపకులంతా అంకితభావంతో పనిచేసి మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ నీరజ, రేణుక, పేరెంట్‌ కమిటీ సభ్యులు సైదయ్య, యాదయ్య, పాండు, నాగరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>