గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 10, 2020 , 11:38:37

సఖీ సేవలపై విస్తృత ప్రచారం చేయాలి

సఖీ సేవలపై విస్తృత ప్రచారం చేయాలి

నల్లగొండ, నమస్తే తెలంగాణ: సఖీ వన్‌స్టాప్‌ కేంద్రం ద్వారా మహిళలకు అందిస్తున్న సేవలపై విస్తృత ప్రచారం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ సూచించారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సఖీ వన్‌స్టాప్‌ కేంద్రం జిల్లా స్థాయి మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. నేడు అన్ని ప్రాంతాల్లో లైంగిక దాడులు, వేధింపులు, గృహ హింస, మహిళలపై అత్యాచారం లాంటి ఘటనలు జరుగుతున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని సఖీ వన్‌స్టాప్‌ కేంద్రం ద్వారా న్యాయ విద్యా, వైద్య పోలీస్‌ సేవలను అందించేందుకు వారికి సమాచారం అందించాలన్నారు. మహిళలకు నైపుణ్యాలు పెంపొందించేలా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వేణు మాట్లాడుతూ మహిళ, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధ్దుల సంక్షేమంతో పాటు మహిళల కోసం న్యాయసేవాధికార సంస్థ ఎప్పుడు సేవలు చేయడానికి అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం ఐసీడీఎస్‌ పీడీ సుభద్ర మాట్లాడుతూ 2017 డిసెంబర్‌లో ప్రారంభించి ఇప్పటి వరకు 890 కేసులు నమోదు చేయడంతో పాటు బాధిత మహిళలకు సఖీ కేంద్రం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ రావు, ఏఎస్పీ నిర్మల, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, సెక్టోరియల్‌ ఆఫీసర్‌ అరుణశ్రీ, ఏపీఎం చంద్రశేఖర్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైద్య శాఖ అధికారి ఎస్‌ఏ రఫీ పాల్గొన్నారు.


logo
>>>>>>